కొంప ముంచిన ఎస్ఎంఎస్ బెంగళూరు : బెంగళూరు బనస్వాడిలో నివసిస్తూ ఒక ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న ఎస్.పి. కట్టిమణి ఇంగ్లండ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తూ ఆరు నెలల క్రితం తన మొబైల్ లో ఎస్ఎంఎస్ అందుకున్నప్పుడు ఆయన ఆనందానికి అంతే లేకపోయింది.
తనకు వచ్చిన జాబ్ ఆఫర్ కు దరఖాస్తు చేయడానికి ఆయన మొదట్లో కొంత సంకోచించారు. ఎస్ఎంఎస్ లో ఇలా ఉంది: 'తక్షణ ఉద్యోగావకాశాలు గల టిఎం రెజొనెంట్ (యుకె.టిఐసి) అనుభవజ్ఞులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని అభిలషిస్తున్నది. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను యుకె ట్రేడ్ ఇన్వెస్ట్ మెంట్ కు పంపవచ్చు'. ఇది వదలుకోకూడదనే ఆశలు రేకెత్తించేదిగా ఉంది. అందులో సూచించిన సంబంధిత వ్యక్తి -ఇంగ్లండ్ ఆండర్సన్ స్మిత్ కు ఆయన వెంటనే ఒక మెయిల్ పంపారు.
తరువాత కట్టిమణికి మీరు ఉద్యోగానికి ఎంపికైనట్లుగా ఒక మెయిల్ అందింది. ఆయన ఇ-మెయిల్ ద్వారా కంపెనీతో ఒక ఒప్పందంపై సంతకం కూడా చేశారు. ఆ తరువాత వారి సూచన ప్రకారం ఆయన నిరీక్షించసాగారు. రిక్రూటర్ కు సంబంధించిన ఆసియా జోన్ కో-ఆర్డినేటర్లు డేవిడ్ మోయర్, గ్లోరీ రోజ్ లను సంప్రదించవలసిందిగా ఆయనను కంపెనీ కోరింది. అటుపిమ్మట ఆసియా జోన్ కో-ఆర్డినేటర్ కు అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను పంపవలసిందిగా ఆయనను కంపెనీ ఆదేశించింది. ఆ కో-ఆర్డినేటర్ ఆ డాక్యుమెంట్లను ఆయనకు వీసా కోసం ముంబైలోని బ్రిటిష్ హైకమిషన్ కు పంపుతారని సంస్థ తెలిపింది. ఆతరువాత కట్టిమణి తనకు విదేశీ ఉద్యోగం వస్తున్నదనే ధీమాతో ముంబైలోని కో-ఆర్డినేటర్ కు తన ఆఫర్ లెటర్ స్కాన్డ్ కాపీని ఇ-మెయిల్ లో పంపారు.
ఆతరువాత తన పాస్ పోర్ట్ కాపీలు, నాలుగు ఫోటోగ్రాఫ్ లను పంపి ప్రాసెసింగ్ ఫీజుగా 430 బ్రిటిష్ పౌండ్లను కంపెనీకి చెల్లించవలసిందిగా కట్టిమణిని కోరారు. దానికి సమానమైన మొత్తం రూ. 32,300ను ఆయన ముంబైలోని ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) బ్రాంచ్ లో ఆసియా జోన్ అకౌంట్ కు బదలీ చేశారు. అంతే ఆతరువాత కంపెనీ మౌనం వహించింది. కట్టిమణి రెండు నెలల పాటు నిరీక్షించినా కంపెనీ నుంచి ఏ వర్తమానమూ రాలేదు. తరువాత ఆయన కంపెనీలో కొందరు వ్యక్తులతో సంప్రదించగా వారు ఆయనను 600 పౌండ్లు చెల్లించవలసిందని కోరారు.
ఈసారి ఆ మొత్తం చెల్లించేందుకు కట్టిమణి నిరాకరించి, తాను అంతకుముందు చెల్లించిన మొత్తాన్ని వాపసు చేయవలసిందని కోరారు. కాని తమ నిబంధనల ప్రకారం, ఒకసారి చెల్లించిన సొమ్మును వాపసు చేయజాలమని కంపెనీ స్పష్టం చేసింది. అటుపిమ్మట వారు 21 రోజుల పాటు వేచి ఉండవలసిందిగా ఆయనను కోరారు. కాని ఆయనకు మరేమీ వర్తమానం రాలేదు. అప్పుడు కట్టిమణి కో-ఆర్డినేటర్ రోజ్ ను సంప్రదించారు. లండన్ లో ఉన్న మోయర్ తో మాట్లాడవలసిందిగా ఆయనకు ఆమె సూచించింది.
Pages: 1 -2- News Posted: 9 September, 2009
|