వరి తీపి... చెరకు చేదు న్యూఢిల్లీ : దేశంలో వర్షపాతం లోటు ఇటీవలి వారాలలో తగ్గింది. దీనితో వరి ధాన్యం దిగుబడిపై ఆశలు రేకెత్తుతున్నాయి. కాని చిరుధాన్యాలు, చెరకు, మొక్కజొన్న దిగుబడి గణనీయంగా తగ్గిపోవచ్చునని వాతావరణ, పంటల శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దేశంలో మొత్తం మీద వర్షపాతం లోటు బుధవారానికి మామూలు కన్నా 20 శాతం కన్నా తక్కువగా ఉంది. సెప్టెంబర్ 2 నాటి లోటు మైనస్ 23 శాతం, అంతకు మూడు వారాల క్రితపు లోటు మైనస్ 29 శాతం కన్నా ఇది మెరుగని భారత వాతావరణ శాఖ (ఐఎండి) డేటా ద్వారా విదితమవుతున్నది.
'క్రమంగా మెరుగుదల కనిపించింది' అని ఐఎండి డైరెక్టర్ జనరల్ అజిత్ త్యాగి తెలియజేశారు. 'ప్రస్తుత వర్షాల సరళి, ఆశిస్తున్న వర్షపాతం సెప్టెంబర్ అంతా కొనసాగినట్లయితే మొత్తం మీద సీజన్ లో లోటు 15 శాతం, 18 శాతం మధ్య ఉండవచ్చు' అని ఆయన సూచించారు. అటువంటి లోటును ఇటీవలి కాలంలో అత్యం. అనావృష్టి సంవత్సరమైన 2002తో పోల్చవచ్చు. ఆ సంవత్సరం వర్షపాతం లోటు మామూలు కన్నా 19 శాతం దిగువన ఉన్నది.
దేశంలోని కొన్ని ప్రాంతాలలో వరి ధాన్యం దిగుబడి 20 శాతం తక్కువగా ఉండవచ్చునని పంటల విశ్లే,కులు క్రితం నెల సూచించారు. కాని గడచిన మూడు వారాలలో పడిన వర్షాల వల్ల వరి దిగుబడి పెరిగే అవకాశం ఉందని ఐఎండికి చెందిన సీనియర్ వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త లక్ష్మణ్ సింగ్ రాథోడ్ అభిప్రాయం వెలిబుచ్చారు. 'వరి దిగుబడిలో లోటును కచ్చితంగా సూచించలేం. కాని ఇంతకుముందు సూచించిన స్థాయి కన్నా మెరుగుదల ఉండగలదని ఆశిస్తున్నాం' అని రాథోడ్ చెప్పారు. 'తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్, బెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్ లలో గణనీయంగా వర్షపాతం నమోదైంది' అని ఆయన తెలిపారు.
Pages: 1 -2- News Posted: 10 September, 2009
|