రోశయ్యంటే లోకువా! హైదరాబాద్ : రోశయ్యను అతని సహచరులు ముఖ్యమంత్రిగా ఇంకా గుర్తించినట్టు కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నారని 'ఢిల్లీ' నాయకులు చెప్పినప్పుడల్లా తాము సహకరిస్తున్నామని మంత్రులు స్పష్టం చేయడం షరా మామూలైంది. అది మాటలకే తప్ప - మనస్పూర్తిగా ఆచరణలో ఉన్నట్టు కనిపించడం లేదనడానికి నిదర్శనం - ముఖ్యమంత్రిగా రోశయ్య గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రుల శరీర భంగిమ (బాడీ లాంగ్వేజ్) లే నిదర్శనం.
రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విస్తరణ, ఆహార వస్తువుల అధిక ధరల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై రోశయ్య ముఖ్యమంత్రి హోదాలో తొలిగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్ణీత సమయాని కన్నా అరగంట ఆలస్యంగా ప్రారంభమైన వీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పన్నెండు మంది మంత్రుల్లో ఎక్కువ మంది మొక్కుబడిగా సమావేశంలో పాల్గొన్నట్టు పరిశీలకులకు కనిపించింది. ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతుంటే... కొంతమంది మంత్రులు అటూ ఇటూ నడిచారు, మరికొంత మంది కాళ్ళు ఊపుతూ 'రిలాక్స్ డ్'గా కనిపించారు. కొంతమంది 'బాడీ ప్రెజంట్ - మైండ్ ఆబ్సెంట్' తరహాలో నిర్లిప్తంగా చూస్తూ కూర్చున్నారే తప్ప... వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నందుకు ఒక సూచన కూడా చేయలేదు. వ్యవహారమంతా ముఖ్యమంత్రిదే అన్నట్టుగా మంత్రులు ప్రేక్షక పాత్ర వహించారు.
Pages: 1 -2- News Posted: 18 September, 2009
|