ఆ మహిళల తీరే వేరు ఇంఫాల్ : టెన్నిస్ స్టార్ కిమ్ క్లిస్టర్స్ లేదా బాక్సింగ్ చాంపియన్ ఎఫ్.సి. మేరీకోమ్ వంటి తల్లులు కొందరు ఏస్ లు వేస్తారు లేదా ముష్టిఘాతాలతో పడగొడతారు. సంఘర్షణ ప్రాంతాలలో తింగుజమ్ కిరణ్ మాల, అబోయి వైఫెయి వంటి ఇతర తల్లులు బెదరించి డబ్బు వసూలు చేయడానికై నోట్లు, పిస్టల్స్ బట్వాడా చేస్తుంటారు.
మణిపూర్ లోని తీవ్రవాద సంస్థలు తమ విచ్ఛిన్నకర కార్యకలాపాలకు కొంత కాలం క్రితం భద్రతా సిబ్బందిని లోపాయికారీగా వినియోగించుకుంటుండేవారు అంటే తమ పనులను వారికి ఔట్ సోర్సింగ్ చేస్తుండేవి ఈ సంస్థలు. ఇప్పుడు ఈ తీవ్రవాద సంస్థలు తమ వేర్పాటువాద ఉద్యమాలకు బలం చేకూర్చుకోవడానికి పిన్నవయస్కులైన గృహిణులను, వీలైతే చంకలో పసిబిడ్డలు ఉన్నవారిని నియోగిస్తున్నాయి. ఈ సంస్థలలో జీతానికి పని చేసే ఐదుగురు మహిళలను మణిపూర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తీవ్రవాద సంస్థలు అనుసరిస్తున్న ఈ వినూత్న పద్ధతి గురించి పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని కక్వా లైలాండో లాంపాక్ ప్రాంతం వాసులు పోలీసులకు ఉప్పందించారు. ఆ ప్రాంతం ప్రధాన్ పి. దేవన్ ను బెదరించి డబ్బు వసూలు చేస్తుండగా కిరణ్ మాల అలియాస్ ఇనవోబి (30)ని వారు క్రితం వారం పట్టుకున్నారు. తమకు కోరిన డబ్బును చెల్లించవలసిందంటూ ఆయనకు నిషిద్ధ కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (కెసిపి) ఇంతకుముందు ఒక నోటీస్ జారీ చేసింది. స్థానికులు ఆతరువాత ఆమెను, ఆమె సహాయకులలో ఇద్దరిని ఒక గస్తీ కమాండో యూనిట్ కు అప్పగించారు. ఆ ఇద్దరిలో ఒకరు అబోయి వైఫెయి (31) అనే మహిళ కాగా, మరొకరు ఆరవ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్ బి) రైఫిల్ మాన్ నుగుల్ ఖోహావో వైఫెయి (22). గస్తీ కమాండో యూనిట్ ఆ ముగ్గురినీ తూర్పు ఇంఫాల్ జిల్లాలోని పోలీసులకు అప్పగించింది.
Pages: 1 -2- News Posted: 22 September, 2009
|