స్త్రీలకు 'కొరడా' చికిత్స! నామక్కల్: శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారత దేశం ప్రపంచ దేశాలలో పోటీ పడే స్థాయికి ఎదిగినప్పటికీ దేశంలోని ఇంకా అనేక ప్రాంతాలో ఏళ్ళ తరబడి సాగుతున్న అనాగరిక ఆచారాలు, మూఢ నమ్మకాల నుంచి ఇంకా విముక్తి పొందలేకపోతోంది. దుష్ట శక్తులు 'ఆవహించినట్లు'గా భావిస్తున్న 2000 మందికి పైగా మహిళలకు 'ఆ దుష్ట శక్తుల బారి నుంచి విముక్తి కల్పించడానికై' వారిని తీవ్ర స్థాయిలో కొరడా దెబ్బలకు గురి చేశారు. తమిళనాడులో తిరుచ్చి, నామక్కల్ జిల్లాల సరిహద్దులోని కుగ్రామం బవిత్రం వెళ్లలపట్టిలో గల పురాతన శ్రీ అచ్చప్పన్ ఆలయంలో వార్షిక ఉత్సవం సందర్భంగా విజయదశమి రోజు (సోమవారం) ఇలా కొరడా దెబ్బలు తిన్న ఆ మహిళలలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళే టీనేజ్ యువతులు కూడా ఉన్నారు.
'దుష్ట శక్తులు ఆవహించిన' ఆ మహిళలు వాటి బారి నుంచి విముక్తి పొందడానికై ఆలయం సమీపంలో 'కొరడా దెబ్బల మైదానం'గా పేర్కొనే సువిశాల ప్రదేశంలో అర కిలో మీటరు పొడవునా క్యూలో సుమారు ఐదు గంటల సేపు కూర్చొనగా సాంప్రదాయక దుస్తులు ధరించిన పూజారులు వారిపై కొరడాలు ఝళిపించారు.
వారిలో పిన్న వయస్కులైన పాఠశాలలు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థినులు అనేక మంది కూడా ఉన్నారు. కొరడాలు తగిలినప్పుడు వారు బాధతో నేలపై పడి మెలికలు తిరిగారు కూడా. పొడవైన, బలమైన కొరడాలు ఎంతో ఊపుతో వచ్చి తమకు తగిలినప్పుడు వారు ఊపిరి తీసుకోవడానికి సైతం కష్టపడ్డారు. వారి శరీరాలపై అవి మచ్చలను మిగిల్చాయి. వారు అమిత బాధతో వెక్కివెక్కి ఏడ్చారు కూడా. తమను ఆవహించిన 'అనేక దుష్ట శక్తుల'ను పారద్రోలడానికి వారిలో చాలా మంది మూడు నాలుగు కొరడా దెబ్బలు తిన్నారు.
Pages: 1 -2- News Posted: 30 September, 2009
|