అది హెల్మెట్టే, కాని... చెన్నై : అది చూపులకు మామూలు హెల్మెట్ వలె ఉంటుంది. కాని దానిలో పొందుపరచిన టెక్నాలజీ ప్రాణాలను కాపాడుతుంది. మద్యం నిషాలో ఉన్న రైడర్ ను మోటార్ సైకిల్ ను స్టార్ట్ చేయకుండా అడ్డుకుంటుంది. ఐఐటి మద్రాసు విద్యార్థులు ఇద్దరు రూపకల్పన చేసిన 'టెక్మెట్' ఒక హెల్మెట్. ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే అది రైడర్ జిపిఎస్ వివరాల గురించి ఎస్ఎంఎస్ అలర్ట్ ను పంపగలదు. ఒక వేళ రైడర్ మోతాదుకు మించి మద్యం సేవించి ఉన్నట్లయితే బ్రెతలైజర్ బైక్ ను స్టార్ట్ కానివ్వది. హెల్మెట్ ను అలా పక్కన వదలివేయలేరు కూడా. ఎందుకంటే రైడర్ ఆ హెల్మెట్ ను ధరిస్తేనే బైక్ స్టార్ట్ అవుతుంది. ఐఐటి మద్రాసు కాంపస్ లో ఈ వారం నిర్వహించనున్న 'శాస్త్ర 2009' సాంకేతిక ఉత్సవం లేదా ప్రదర్శనలో ఆవిష్కృతం కానున్న కొన్ని డజన్ల వినూత్న వస్తువులలో ఆ హెల్మెట్ ఒకటి.
'లాప్ టాప్ ల నుంచి ఈ ఆలోచన వచ్చింది. లాప్ టాప్ కనుక అనుకోకుండా చేతిలో నుంచి జారి కిందపడితే దానికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ లు లాక్ అయిపోతాయి కదా. వేగంలో ఆకస్మిక పెరుగుదలను కనిపెట్టే ఇన్-బిల్ట్ ఏక్సెలెరోమీటర్ ఈ పని చేస్తుంది. అదేవిధంగా హెల్మెట్ లోపల అమర్చిన ఏక్సెలెరోమీటర్ హఠాత్తుగా ఏదైనా సంఘటన జరిగినట్లయితే ఒక సంకేతాన్ని పంపుతుంది. ఇది హెల్మెట్ లోపల గల జిపిఎస్ సాధనాన్ని రైడర్ మొబైల్ ఫోన్ (బ్లూటూత్ ట్రాన్స్ మిటర్ ద్వారా)కు రిలే చేసేట్లు చేస్తుంది. ఆతరువాత ఆ సమాచారం మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అత్యవసర సర్వీసులకు, బంధువులకు రిలే అవుతుంది' అని ఆ హెల్మెట్ సృష్టికర్తలలో ఒకరైన రాజన్ గుప్తా వివరించారు. గుప్తా మూడవ సంవత్సరం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి.
ఎస్ఎంఎస్ అలర్ట్ 'మీ బంధువు లేదా మిత్రుడు ఫలానా (అక్షాంశం, రేఖాంశం సూచికలతో) ప్రదేశంలో ప్రమాదానికి గురయ్యారు' వంటి ముందుగా సిద్ధం చేసిన టెక్స్ట్ మెసేజ్ కావచ్చు. రిసీవర్ మొబైల్ కూడా జిపిఎస్ సౌకర్యం ఉన్నదైతే దానిని రైడర్ ఉన్న ప్రదేశాన్ని కచ్చితంగా సూచించేదిగా ఆ మెసేజ్ ను మార్చగలదు. 'ప్రదేశం పేరును నేరుగా సూచించగలిగే విధంగా హెల్మెట్ జిపిఎస్ లో నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల పేర్లను పొందుపరచడం ద్వారా ఈ సిస్టమ్ ను మరింత మెరుగ్గా చేయాలని యోచిస్తున్నాం' అని గుప్తా తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 30 September, 2009
|