బులెట్ ప్రూఫ్ డాగ్ స్క్వాడ్ న్యూఢిల్లీ : బ్లాక్ కాట్స్ తరఫున పేలుడు పదార్థాల వాసన పసిగట్టే జాగిలాలకు రక్షణ కవచం రాబోతున్నది. గత సంవత్సరం నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడులు వంటి ప్రాణానికి ముప్పు కలిగే పరిస్థితులు ఎదురైనప్పుడు తుపాకుల కాల్పులు, పేలుడు వస్తువుల నుంచి రక్షణ కల్పించేందుకు తమ జాగిలాలకు బులెట్ ప్రూఫ్ జాకెట్లను సమకూర్చాలని జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్ జి) యోచిస్తున్నది.
గ్రెనేడ్లతో సహా పేలుడు వస్తువుల కోసం ముంబైలోని నారిమన్ హౌస్, తాజ్ మహల్ హోటల్ లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎన్ఎస్ జి స్నిఫర్ డాగ్ లు కొన్ని గంటలు గడిపాయి. కాలిపోయిన ఫర్నిచర్ కింద పడి ఉన్న పదవ టెర్రరిస్టు మృతదేహాన్ని అవి వాసన పసిగట్టాయి. అతను ఉపయోగించిన ఎకె 47 రైఫిల్ అతని పక్కనే పడి ఉంది.
ఆ జాగిలాలు ఒక విధంగా అదృష్టవంతులు. అవి తనిఖీ చేసిన ప్రదేశంలో పేలుడు వస్తువులు ఏవీ లేవు. ఆ జాగిలాల వెంట ఉన్న సిబ్బంది మాత్రమే బులెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి ఉన్నారు. ఆ లాబ్రడార్లకు అటువంటి సురక్షిత దుస్తులు లేవు. 'ఇవి లెవెల్ 3 జాకెట్లు. పేలుడు వస్తువుల శకలాల నుంచి లేదా తుపాకి కాల్పుల నుంచి జాగిలం ప్రాణాన్ని ఇవి కాపాడగలవు' అని ఒక ప్రైవేట్ రక్షణ కవచాల సంస్థ అంజనీ టెక్నోప్లాస్ట్ ప్రధాన సలహాదారుడు విజయ్ గుప్తా సూచించారు. నవంబర్ 26 దాడుల అనంతరం కేంద్ర హోమ్ మంత్రత్వశాఖకు ఈ సంస్థే బులెట్ ప్రూఫ్ జాకెట్లను సరఫరా చేసింది.
Pages: 1 -2- News Posted: 3 October, 2009
|