తవంగ్ పై సందర్శకుల 'దాడి' బుమ్లా (చైనా) : తవంగ్ లో అది మరొక రకం ఆక్రమణ. దానికి కేంద్రకం చైనా. 64 సంవత్సరాల తుప్టెన్ జంబీకి ఇటువంటి అనుభవం ఇంత వరకు ఎన్నడూ కలగలేదు. అక్కడ ఉన్న ఏకైక ఫిల్లింగ్ స్టేషన్ అతనిదే. టూరిస్టులతో నిండి ఉన్న వాహనాలు ఆ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద బారులు తీరి ఉన్నాయి. 'ఐదు నుంచి ఏడు రోజులకు ఒకసారి టాంకర్లు వస్తుంటాయి. ఫలితంగా నేను పెట్రోల్, డీజెల్ కు రేషన్ పెట్టవలసి వస్తున్నది. బుధవారం (సెప్టెంబర్ 30న) ఒక్కొక్క వాహనానికి 30 లీటర్లు పోసిన నేను గురువారం 15 లీటర్లకు తగ్గించాను' అని అతను చెప్పాడు. 'శుక్రవారం పది లీటర్లు మాత్రమే ఇచ్చాను' అని అతను తెలిపాడు.
సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తున అరుణాచల ప్రదేశ్ లో ఉన్న ఈ జిల్లా కేంద్రంలోని హోటళ్ళు, గెస్ట్ హౌస్ లు సందర్శకులతో నిండిపోయాయి. వాటిలో చాలా వరకు నెహ్రూ మార్కెట్ ప్రాంతంలోనే ఉన్నాయి. వారందరి మనస్సుల్లో చైనాయే ఉంది. 1962 యుద్ధ సమయంలో చైనా కొద్ది కాలం తవంగ్ ను ఆక్రమించుకున్నది.
'ఈ హోటల్ లోని 11 గదులలో పరిమితికి మించి అతిథులు ఉన్నారు' అని 42 సంవత్సరాల హోటల్ మేనేజర్ లాబ్సంగ్ తెండా తెలియజేశారు. ఈ సందర్శకుల తాకిడి సెప్టెంబర్ 25న మొదలైందని, ఇది మార్చి చివరి వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. 'ఇది వరకు ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ఎక్కువ మంది టూరిస్టులు వచ్చారు. క్రితం సంవత్సరం 500 బెడ్ లు మాత్రమే ఉండగా 700 మందికి పైగా సందర్శకులకు వసతి కల్పించాం. నాలుగు హోమ్-స్టే కాటేజీలు కూడా ఏర్పాటయ్యాయి. కాని అవి చాలవనిపిస్తున్నది' అని తవంగ్ డిప్యూటీ కమిషనర్ గమ్లీ పడు పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 3 October, 2009
|