'శ్రీశైలం' దెబ్బతిందా? హైదరాబాద్ : శ్రీశైలం డ్యామ్ సామర్ధ్యం కంటే రెట్టింపు స్థాయిలో మొదటిసారిగా వరద తాకిడికి గురి కావడంతో డ్యామ్ ప్రధాన కట్టడం (స్ట్రక్చర్), గేట్లకు ఏదైనా నష్టం వాటిల్లిందా? అనే అనుమానాలు సాగునీటి రంగానికి చెందిన ఇంజనీరు నిపుణుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. నష్టం జరిగిందీ లేనిదీ తెలుసుకోవాలంటే డ్యామ్ లో నీరు తగ్గించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేసినప్పుడు 13.60 లక్షల క్యూసెక్కుల నీటిని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత రికార్డుస్థాయిలో అత్యధికంగా 7.36 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో 1998లో నమోదు అయింది. ఈ ప్రాజెక్టు సామర్ధ్యం 13.5 లక్షల క్యూసెక్కులు అయినప్పటికీ అత్యధికంగా వచ్చిన ఇన్ ఫ్లో 7.5 లక్షల క్యూసెక్కులకు మూడింతలకు మించి ఈనెల 2వ తేదీన 26 లక్షల క్యూసెక్కులు నమోదు అయింది. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద 103 ఏళ్ళ కిందట అత్యధిక ఇన్ ఫ్లో 9.85 లక్షల క్యూసెక్కులు నమోదు అయింది. అప్పట్లో శ్రీశైలం ప్రాజెక్టు లేదు.
శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్ చేసినదానికంటే రెట్టింపు సామర్ధ్యం వరదను తట్టుకొని కూడా శ్రీశైలం డ్యామ్ నిలవటం అన్నది చాలా అరుదైన సాంకేతిక నైపుణ్యంగా ఇంజనీరింగ్ నిపుణులు సైతం కొనియాడారు. దీని నిర్మాణం ఈ రంగంలో రోల్ మోడల్ గా నిలవనుందని వారు కితాబు ఇస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 8 October, 2009
|