దారికొస్తున్న మంత్రులు హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యను 'కీపిటప్' అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రశంసించిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు తమ 'పంథా' మార్చుకుంటున్నారు. దిక్కులు పిక్కటిల్లేలా 'జగన్నినాదం' చేస్తూ, రోశయ్యను 'తాత్కాలిక సీఎం'గా చూసినవారంతా 'మా ముఖ్యమంత్రి' అంటున్నారు. వరద కాలంలో రెండు రాత్రులు తన కార్యాలయంలో బసచేసిన రోశయ్య ప్రజలతోపాటు అధిష్టానంలో కూడా తమ పరపతిని పెంచుకున్నారు. తన పట్ల పెద్దగా విశ్వాసం లేని మంత్రులు కూడా 'తప్పనిసరి'గా వరద నియంత్రణ, సహాయక చర్యలను చేపట్టేలా 'వత్తిడి' పెంచారు. అధిష్టానం అనుమతితో 'సీ' బ్లాక్ లోకి మారిన తక్షణమే గనులశాఖ ఉన్నతాధికారి శ్రీలక్ష్మిని బదిలీ చేశారు! అలాగే డీజీపీ యాదవ్ ను కూడా తప్పించారు. తద్వారా పాలనాయంత్రాంగాలపై పట్టు సాధించే ప్రయత్నాన్ని రోశయ్య ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో అధిష్ఠానం 'సూచనల'ను గ్రహించిన మంత్రులు 'వాస్తవ పరిస్థితుల' దృష్ట్యా రోశయ్యను 'తమ ముఖ్యమంత్రి'గా అంగీకరిస్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండాసురేఖ, అహ్మదుల్లా, పి రామచంద్రారెడ్డి మినహా మిలిగిన మంత్రులు ఇదే బాటలో ఉన్నారు. వైఎస్ మృతి చెందిన వెంటనే జగన్ ను సీఎం చేయాలని తొలుతగా మంత్రి రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఇతర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, దానం నాగేందర్, బొత్స సత్యనారాయణ, మాణిక్య వర ప్రసాద్ తదితర మంత్రులు శృతి కలిపారు. జగన్ ను సీఎం చేయకపోతే రాజీనామా చేస్తామని కూడా కొందరు మంత్రులు హెచ్చరించారు.
Pages: 1 -2- News Posted: 9 October, 2009
|