180 దేశాల్లో భారతీయులు ముంబై : 'ఇందు గలడందు లేడని సందేహంబు వలదు...' అంటూ ప్రహ్లాదుడు మహావిష్ణువు గురించి తన తండ్రి హిరణ్య కశిపుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. భారత పౌరులకు కూడా ఇది వర్తించగలదు. ప్రపంచంలో మూడు దేశాలలో మినహా తక్కిన దేశాలలో భారత పౌరులు ఈనాడు శాశ్వత నివాసులుగా ఉంటున్నారు. ప్రపంచంలోని 183 దేశాలలోకి 180 దేశాలలో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఉన్నట్లుగా ప్రవాస భారతీయ వ్యవహారాల (ఒఐఎ) మంత్రిత్వశాఖ నమోదు చేసింది. ఒక్కొక్క దేశంలో ఉంటున్న ఎన్ఆర్ఐల సంఖ్య మారవచ్చు. ఉదాహరణకు లెబనాన్ లో ఇద్దరే ఉండగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ)లో దాదాపు పది లక్షల మంది ఉన్నారు. అయితే, భారతీయులు సమస్త ప్రపంచాన్ని తమ నివాసంగా పేర్కొనగలరనేది వాస్తవం. కేవలం ఉత్తర కొరియా, పాకిస్తాన్, భూటాన్ దేశాలలో మాత్రమే ఒక్క ఎన్ఆర్ఐ కూడా కనిపించరు.
ఎన్అర్ఐలు ఉక్కు పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్ వలె భారతీయులు. మరొక దేశంలో నివసిస్తున్నా వారు తమ నీలి రంగు భారతీయ పాస్ పోర్టులను గర్వంగా ప్రదర్శించగలరు. వారు వీసాలు సంపాదించి, కొద్ది కాలం పాటు పని చేయడానికి లేదా చదువుకోవడానికి విదేశాలకు వెళుతుండే సాధారణ భారతీయ పౌరుల కన్నా భిన్నమైనవారు. ఎన్ఆర్ఐలు భారత పౌరులుగా కొనసాగుతారు. కాని తాము కోరుకున్న దేశంలో శాశ్వతంగా నివసించేందుకు, పని చేసేందుకు వారు హక్కు కలిగి ఉన్నారు.
ఈ భూమిపై మారుమూల ప్రాంతంలో కూడా భారతీయులను ఇప్పుడు చూడవచ్చు. పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న దీవి, ప్రపంచంలో ఈమధ్యే సర్వసత్తాక ప్రతిపత్తి పొందిన దేశం పాలావ్ రిపబ్లిక్ కు వెళితే అక్కడ ఐదుగురు ఎన్ఆర్ఐలు కనిపిస్తారు. బొలీవియా పర్వతసానువుల్లో 20 మంది ఎన్ఆర్ఐలు కనిపిస్తే ఆశ్చర్యపోకండి. అదేవిధంగా ఆఫ్రికాకు కొమ్ము అనదగిన అత్యల్ప దేశం జిబౌటిలో 375 మంది భారతీయులు నివసిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 9 October, 2009
|