మావోలపై మహా యుద్ధం న్యూఢిల్లీ : నెత్తుటేరులు పారించిన నక్సలైట్లపై కేంద్రం మహా సమరాన్ని ప్రకటించింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో వరసగా దాడులకు పాల్పడుతూ పోలీసులను హతమార్చుతున్న నక్సలైట్ల అంతు చూడటానికే అంతిమ నిర్ణయం తీసుకుంది. గడ్చిరోలీ ప్రాంతాన్ని నక్సలైట్ రహితంగా చేయడానికి మరో 3వేల 7 వందల మంది సరిహద్దు భద్రతా బలగాలను కేంద్రం పంపించింది. ఇప్పటికే అక్కడు మహారాష్ట్ర యాంటీ నక్సల్ ఫోర్సు(సి-60)దళాలు, పారామిలటరీ బలగాలు కలిపి 3వేల3వందల మంది ఉన్నారు. భారత వైమానిక దళం కూడా రంగంలోకి దిగిపోయింది. మెషిన్ గన్లు అమర్చిన రెండు ఎంఐ 17 హెలికాప్టర్లు గడ్చిరోలికి చేరుకున్నాయి.
రాష్ట్రానికి నక్సలైట్ పీడ వదిలేవరకూ ప్రభుత్వం యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంటుందని మహారాష్ట్ర హోం మంత్రి జయంత్ పాటిల్ ప్రకటించారు. మరింత బలంతో నక్సల్స్ ను అణచివేయడం తథ్యమని ఆయన పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతన్న నేపథ్యంలో ముమ్మరంగా గాలింపు జరుగుతోంది. నక్సలైట్లు ఆక్రమణలో ఉన్న గడ్చిరోలి మహారాష్ట్రలో ఆగ్నేయంగా ఉంది. తూర్పున ఛత్తీస్ ఘడ్, దక్షిణ, నైరుతీ వైపున ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా ఉన్నాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకని దాడులు చేయడానికి నక్సల్స్ కొత్త వ్యూహాలను అనుసరిస్తురన్నారని మహారాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. ముందుగా చాలా పక్కా సమాచారాన్ని సేకరించి, తరువాత పోలీసు బలగాలను, బలాన్ని అంచనా వేసుకుని దాడులు సాగిస్తున్నారని వివరించారు. మొన్న 17 మంది పోలీసులను కాల్చి చంపినప్పుడు కూడానక్సలైట్లు పకడ్బందీ ప్రణాళికనే అమలు చేశారని వివరిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 10 October, 2009
|