సంఘ్ కౌగిల్లోకి బీజేపీ న్యూఢిల్లీ : పోరాటానికి దిగక మునుపే చతికిల పడుతున్న భారతీయ జనతా పార్టీని పూర్తిగా తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. బీజేపీ సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తన ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో సమూలమైన మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండే యువకులను బీజేపీ రథసారధులుగా నియమించాలని యోచిస్తోంది. రాజనాథ్ సింగ్ స్థానంలోకి రావడానికి ఇద్దరు యువకుల పేర్లు సంఘ్ మనసులో ఉన్నాయని చెప్పుకుంటున్నా ఆ ఇద్దరి అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. వీరిలో ఒకరు వాచాలత్వంతో అవకాశాలను బలహీనం చేసుకుంటుంటే, మరొకరు రాజకీయ కారణాల వలన ఆ పీఠం ఎక్కడం కష్టమని చెబుతున్నారు.
నెల రోజుల క్రితం బీజేపీ అత్యున్నత పదవికి గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పరికార్ పేరు వినిపించింది. కానీ ఆయన నోరు జారి గోతిలో పడ్డారు. ఓ టెలివిజన్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ పాత చింతకాయ పచ్చడనీ, ఆయన గౌరవప్రదంగా తప్పుకోవడం మంచిదని వ్యాఖ్యానించి సంఘ్ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. మరో వ్యక్తి మహారాష్ట్ర నాయకుడు నితిన్ గడ్కారీ. ఈయన భవితవ్యం కూడా తాజా ఎన్నికల్లో ఫలితాలపై ఆధారపడి ఉండవచ్చు. ఏది ఏమైనా సంఘ అధినేత మోహన్ రావ్ భగవత్ మాత్రం ఢిల్లీ తారలను బీజేపీ పీఠంపై కూర్చోబెట్టడానికి సుముఖంగా మాత్రం లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు వంటి పాపులర్ ఫిగర్లవల్ల బీజేపీకి ఒనగూడే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదనే అభిప్రాయం ఉన్నప్పటికీ ప్రస్తుత తాజా పరిస్థిల్లో వీరిలో ఎవరినో ఒకరిని తీసుకోక తప్పేట్టు కనబడటం లేదని వారు చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 16 October, 2009
|