ఎవరీ రవిశర్మ? హైదరాబాద్ : వ్యవసాయ శాస్త్రవేత్త రవి శర్మ... సిండికేట్ బ్యాంకు అధికారి అనూరాధ... ఎవరు వీరు.. ఎక్కడి వారు... ఇంత పెద్ద స్థాయిలోని వ్యక్తులు నిజ జీవితంలో చేస్తుందేమిటీ? ఈ ఇద్దరూ కూడా కరడుకట్టిన మావోయిస్టులని పోలీసుల అభియోగం. పోలీసు దళాలపై మందు పాతర్లతో విరుచుపడి హతమార్చడంలో సిద్ధహస్తులని, బీహార్, ఝార్ఖండ్, మహారాష్ట్రల్లో ఇటీవల అనేక మంది అధికారులను హత్యలు చేయడంలో వీరిద్దరి ప్రమేయం ఉందని పోలీసుల వాదన. ఇంతకూ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. నిషేధిత మావోయిస్టు ఉద్యమంలో వీరిద్దరూ కీలకమైన నాయకులని పోలీసుల కథనం. మావోయిస్టు ప్రముఖ నేత కోబాడ్ గాంధీని అరెస్టు చేసిన నెల రోజుల తరువాత ఝార్ఖండ్ పోలీసులు ఈ ఇద్దరినీ పట్టుకున్నారు. ఈ భార్యభర్తల అరెస్టు మావోయిస్టులకు ఎదురచూడని దెబ్బేనని చెబుతున్నారు. హింసాత్మక చర్యలతో సమాజంలోని మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్న మావోయిస్టు ఉద్యమంతో పౌర సమాజంలో సామాన్యంగా కనిపించే వ్యక్తులు చెట్టాపట్టాలేసుకోవడం మానుకోవాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించిన సమయంలోనే ఈ ఇద్దరూ అరెస్టు కావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రవిశర్మ తెలియని వాడేమీ కాదు. ఇతను కీలకమైన మావోయిస్టు నేతగా పోలీసులకు తెలుసు. రాష్ట్రంలో అమర్, ఆనంద్, మహేష్ వంటి మారుపేర్లతో మావో కార్యకలాపాలను నిర్వహించాడు. వాస్తవానికి ఆంధ్ర పోలీసులు రవి శర్మను అక్టోబర్ 10 వ తేదీన పట్నాలో పట్టుకున్నారు. కానీ రాష్ట్రానికి తీసుకువస్తున్నప్పుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. కానీ మూడు రోజులు గడవకుండానే రవి శర్మను, అతని భార్య అనూరాధను ఝార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లాప్ ట్యాప్ కంప్యూటర్, అనేక సిడీలు స్వాధీనం చేసుకున్నామని, వారిని రిమాండ్ లోకి తీసుకోనున్నామని హజారీబాగ్ ఎస్పీ పంకజ్ కంబూజ్ చెప్పారు. వీరి అరెస్టు మావోయిస్టులకు పెద్దదెబ్బేనని ఆయన అన్నారు. బీహర్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో మావోయిస్టు నెట్ వర్క్ ను 2001 సంవత్సరం నుంచీ నడుపుతోంది వీరిద్దరేనని ఆంధ్ర పోలీసు అధికారులు వివరించారు. అనేక సంవత్సరాలుగా ఈ భార్యాభర్తలు రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారని, ఆ ప్రాంతాలన్నీ వారికి కరతలామలకమనీ, అందుకే అక్కడ విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహించగలిగారని చెప్పారు.
పేద వ్యవసాయ కుటుంబానకి చెందిన రవిశర్మ వ్యవసాయ శాస్త్రం చదువుతూ డిగ్రీలో ఉన్నప్పుడే నక్సలైట్ ఉద్యమం ప్రభావానికి గురైయ్యాడు. మెహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈయన పదిహేడేళ్ళ వయసులోనే నక్సలైట్ ఉద్యమంలోకి విద్యార్థులను ఆకర్షించే బాధ్యతలను చేప్టటాడు. రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు. తన స్వగ్రామంలో జమిందార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోపాల్గన్న రవిశర్మను 1985లో మొదటిసారిగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్జీ రంగా యూనివర్శిటీలో చేరిన తర్వాత సాయుధ దాడులకు రవిశర్మ నాయకత్వం వహించారు. వరంగల్ , నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో జరిగిన అనేక మందు పాతర్ల పేలుళ్ళ సంఘటనల్లో రవిశర్మ ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 16 October, 2009
|