కంపెనీ మెడికల్ కాలేజీలు! న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ కాలేజీలకు పోటీగా మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. మెడికల్ కాలేజీల ఏర్పాటుపై ఉన్న అనేక పరిమితులను ప్రభుత్వం సడలించబోతోంది. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు ప్రభుత్వం, ట్రస్ట్, సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇక నుంచి ప్రైవేట్ కంపెనీలు సైతం మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించబోతోంది. కంపెనీ చట్టం కింద రిజిస్టర్ అయిన ఏ కంపెనీ అయినా మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవచ్చు.
మెట్రో నగరాలలో మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి కనీసం 25 ఎకరాల భూమి ఉండాలి. ఈ నిబంధనను సైతం సడలించి కేవలం 10 ఎకరాల భూమిలో కాలేజీ కాంపస్ ను నిర్మించునే వీలు కల్పించబోతున్నారు. దేశంలో వైద్య విద్యను సమూలంగా సంస్కరించేందుకు నడుంబిగించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ అజాద్ ఈ దిశగా ప్రతిపాదించిన చర్యలకు ఆమోద ముద్ర వేశారు. మెడికల్ కాలేజీ స్థాపనకు స్థలం నిబంధనలను సడలించడం ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ కాలజీల ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అలాగే కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు వీలుగా పోస్టు గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను 30 శాతం పెంచడం మంత్రి అజాద్ తలపెట్టిన సంస్కరణలలో ముఖ్యాంశాలు.
Pages: 1 -2- News Posted: 18 October, 2009
|