'క్రైమ్ కథనాలే నాకు స్ఫూర్తి' హైదరాబాద్ : సమాజంలో వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంచాల్సిన టీవీలు... తమ 'క్రైమ్' పరిశోధన కార్యక్రమాలతో నేర సంఘటనలను ప్రోత్సహిస్తున్నాయనడానికి కార్వాన్ లో జరిగిన సంఘటనే ఉదారహణగా నిలుస్తుంది. సమాజంలో జరిగే నేరాలను - ఘోరాలను క్రైమ్ కథనాల పేరిట దాదాపు అన్ని టీవీ ఛానళ్ళు ప్రేక్షకుల మెదళ్ళల్లోకి చొప్పిస్తున్నాయి. పోలీసులకు దొరక్కుండా... నేరాలకు ఎలా పాల్పడవచ్చనేది.. 'కల్పిత పాత్ర'లతో మరీ చూపిస్తున్నాయి. 'దృశ్యాల'తో 'జీవం' ఉట్టిపడిన కథనాల ప్రభావం ఊరికే పోదు కదా. ఈ కథనాల నుంచి స్ఫూర్తి పొందిన యువత తమ కార్యాలను చక్కబెట్టుకునేందుకు ఈ కథనాలను ఆధారం చేసుకుంటోంది. కానీ.. నేరగాళ్ళు చివరకు పోలీసులకు చిక్కుతారన్న సత్యాన్ని వీరు మరచిపోవడమే విషాదం. టీవీ కథనాల నుంచి ప్రేరణ పొందిన యవతి... తన 'స్నేహితుడి' సాయంతో భర్తను హతమార్చిన సంఘటన ఈనెల 12న హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మహీంద్ర సత్యం కంపెనీ ఉద్యోగి ఎన్.చంద్రశేఖర్ (24), అనూష (22) లకు నెట్లో పరిచయం పెరిగి... 2008 ఫిబ్రవరిలో వివాహానికి దారి తీసింది. వీరు తాళ్ళగడ్డలో కాపురం పెట్టారు. మరోవైపు దిల్ షుక్ నగర్ లోని డిగ్రీ కళాశాల విద్యార్థి నవీన్ కుమార్ తో 2008 డిసెంబర్ లో నెట్ ఛాటింగ్ లో అనూషకు పరిచయం పెరిగింది. భర్త తనను హింసిస్తాడని చెప్పిన ఆమె, నవీన్ కుమార్ తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకొంది. అనంతరం భర్తను ఎలాగైనా 'అడ్డు తప్పించాలని' అనూష భావించింది. ఇందుకు నవీన్ సాయాన్ని కోరింది. అక్టోబర్ 12వ తేదీన తమ ప్లాన్ అమలుకు ముహూర్తంగా నిర్ణయించారు.
Pages: 1 -2- News Posted: 20 October, 2009
|