95 కోట్లయిన వెయ్యి! ముంబై : మీ బ్యాంక్ ఖాతాలో రూ. 95 కోట్లు ఉన్నట్లు మీరు గమనిస్తే ఏమి చేస్తారు? అందునా ఒక చాల్ లో నివసిస్తూ, రోజూ మురికినీటిని దాటుకుంటూ ఆఫీసుకు వెళ్ళి తిరిగి తెల్లవారు జామున 3 గంటలకు ఆఫీసులో నుంచి బయటపడే 20 ఏళ్ళ వయస్కుడైతే ఆ అనుభవం ఎలా ఉంటుంది?
ఒక కాల్ సెంటర్ లో పని చేస్తున్న వైభవ్ పవార్ రోజూ వలె తెల్లవారు జామున 3 గంటలకు తన ఆఫీసులో నుంచి బయటపడి, మజగాఁవ్ లోని హెచ్ డిఎఫ్ సి ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్ (ఎటిఎం)లో డబ్బు విత్ డ్రా చేస్తున్నారు. ఆయన ఖాతాలో రూ. 95,70,00,000 మేర భారీ బ్యాలెన్స్ ఉన్నట్లు ఎటిఎం సూచించింది.
'అది నా అకౌంట్ నంబర్ అని భావించాను' అని వైభవ్ పవార్ ఆ రోజు తాను తీసుకుని నలిపివేసిన రసీదును చూపిస్తూ చెప్పారు. పవార్ నెల జీతం రూ. 10 వేలు. ఆయన తొమ్మిది నెలల క్రితం ఈ ఉద్యోగంలో చేరారు. అయితే తన కళ్ళను తానే నమ్మలేక ఆయన రూ. 600 విత్ డ్రా చేసి తన బ్యాలెన్స్ ను సరిచూసుకున్నారు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ రూ. 75 కోట్లుగా కనిపించింది. ఎటిఎం మెషీన్ సరిగ్గా పని చేయడం లేదని సర్ది చెప్పుకుని పవార్ సమీపంలోని ఇతర ఎటిఎంలలో తన అకౌంట్ బ్యాలెన్స్ ను సరిచూసుకోవాలనుకున్నారు. అవన్నీ అదే మొత్తాన్ని చూపించాయి.
పవార్ బైకుల్లాకు తిరిగి వెళ్ళి బైకుల్లా స్టేషన్ వెలుపల ఉన్న ఎస్ బిఐ ఎటిఎంలో నుంచి రూ. 200 విత్ డ్రా చేశారు. ఇప్పుడు ఆ ఎటిఎం బ్యాలెన్స్ నురూ. 15 కోట్లుగా సూచించింది. ఆ సమీపంలోని ఇతర ఎటిఎంలు కూడా అదే సంఖ్యను చూపించాయి. ఈ అనూహ్య లాభం గురించి తనకు అకౌంట్ ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్ బి)లో మాట్లాడడానికి పవార్ ప్రయత్నించారు. కాని ఆయన డయల్ చేసిన టోల్-ఫ్రీ కాల్ సెంటర్ హెల్ప్-లైన్ నుంచి స్పందనే లేదు.
Pages: 1 -2- News Posted: 23 October, 2009
|