అంతా జగన్నాటకమే! హైదరాబాద్ : రభస జరుగుతుందేమో? రాసాభాస అవుతుందేమో? తమ మాట పోతుందేమో? తిరుగుబాటు బావుటా ఎగురుతుందేమో? ధిక్కార స్వరాలు వినిపిస్తాయేమో? ... ఇన్ని సందేహాలతో ఇంతకాలం జరగని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం(సిఎల్ పి) సమావేశానికి ఇక ముహూర్తం పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సన్నద్ధమవుతోంది. అధినేత్రి సోనియాగాంధీ ఉపదేశించిన మంత్రానికి కడప ఎంపీ జగన్మోహనరెడ్డి బుద్ధిగా బద్దుడు కావడంతో సిఎల్ పిని సమావేశపర్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సంతాపం ప్రకటించడం, సిఎల్ పి నేతగా రోశయ్యనో, మరొకరినో ఎన్నుకునేందుకే సిఎల్ పి సమావేశం అన్నది లాంఛనం మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకూ అక్కడి నుంచే అసలు కథ మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సిఎల్ పి సాదాసీదాగా ముగిసిపోయేది కాదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. 2014 ఎన్నికల లక్ష్యంగా అధిష్టానం జగన్ పాత్రను పెంచడానికి అక్కడే శ్రీకారం చుడుతుందని అంటున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ జగన్, జగన్ విధేయవర్గం ప్రధాన భూమికను పోషించడానికి నాందీ ప్రస్తావన జరుగుతుందనీ చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 23 October, 2009
|