పేరుకే 'పుష్కర్'ణి! పుష్కర్ : ఎవరైనా ఈ మాటను అసంబద్ధమైనదిగా తోసిపుచ్చవచ్చు. సరస్సే లేని పుష్కర్! తాజ్ మహల్ లేకుండా ఆగ్రాను ఊహించుకోవడానికి ప్రయత్నించండి.
కాని అసాధ్యమైనదే పుష్కర్ లో సంభవించింది. అదీ ఒక ఏడాది లోపలే. క్రితం సంవత్సరం వరకు సరస్సు నిండుగా నీటితో ఉన్నది. (వేసవిలో సైతం తగినంత నీరు ఉంది). ఈ సంవత్సరం ఎండిపోయిన తవ్విన ప్రదేశంలా కానవస్తున్నది. దేశ దేశాల నుంచి వేలాది మంది యాత్రికులను ఆకర్షించే, అత్యంత ప్రచారం జరిగే పుష్కర్ ప్రదర్శన (సంత) వచ్చే సోమవారం (అక్టోబర్ 26న) ప్రారంభం కానున్న దశలో ఈ సరస్సు ఇటువంటి స్థితికి గురి కావడం విశేషమే మరి!
మరీ విచిత్రమేమిటంటే సరస్సును శుభ్రం చేసి, మరింత లోతు చేసేందుకు ప్రభుత్వం రూ. 50 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు కారణంగా ఇది ఇలా ఎండిపోవడం. 2007లో ప్రాజెక్టును ప్రారంభించే ముందు వేసవిలో సరస్సులో కనీసం ఐదడుగుల నీరు ఉంది. కాని ఇప్పుడు ఒక్క చుక్క నీరు కూడా లేదు. 'సరస్సు సుందరీకరణ ప్రాజెక్టు'గా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టును అమలు జరిపే బాధ్యత రాజస్థాన్ పట్టణాభివృద్ధి శాఖ ఒక భాగమైన అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ (యుఐటి)ది.
'ప్రాజెక్టు పని ప్రారంభించినప్పుడు సరస్సులో నాలుగు అడుగుల మూడు అంగుళాల లోతుకు నీరు ఉంది. పూడిక తీసివేసిన తరువాత మరింత లోతైన, పరిశుభ్రమైన సరస్సును తాము చూడగలమని పుష్కర్ ప్రజలు ఆశించారు' అని పుష్కర్ మార్కెట్ అసోసియేషన్ కు చెందిన రాధే శ్యామ్ శర్మ చెప్పారు. నిరుడు జిల్లా అధికార యంత్రాంగం పూడిక తీసే పనిని మొదలు పెట్టినప్పుడు సరస్సు వెడల్పు, లోతు పెరిగాయని, ఫలితంగా వర్షపు నీరు కనీసం ఒక వారం కూడా నిలువ లేదని, సరస్సు లోతు 15 అడుగులు. కాని దీనిని 25 అడుగులకు పెంచారని ఆయన తెలిపారు.
Pages: 1 -2- News Posted: 24 October, 2009
|