త్వరలో ఒకే కాలుష్య సూత్రం న్యూఢిల్లీ : 2009 సంవత్సరాంతానికి దేశవ్యాప్తంగా కాలుష్యానికి ఒకేవిధమైన పరిమితిని నిర్దేశించనున్నారని, అంటే పారిశ్రామిక, నివాస ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉండదని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం ఉదాహరణకు ప్రధాన కాలుష్య కారకం 'రెస్పిరబుల్, సస్పెండెడ్ పార్టిక్యులెట్ మాటర్' (ఆర్ఎస్ పిఎం) (గాలి ద్వారా వ్యాపించే కాలుష్య పదార్థం) స్థాయిన పారిశ్రామిక ప్రాంతాలకు ఘనపు మీటర్ కు 120 యూనిట్ గ్రాములు (యుజి/ఎం3)ని అనుమతిస్తున్నారు. ఇది పారిశ్రామికేతర ప్రాంతాలలో అనుమతిస్తున్న గరిష్ట పరిమితి 60 యుజి/ఎం3.
'వాయు నాణ్యత నియమావళిని మొదటిసారి 1994 నోటిఫై చేసినప్పుడు చాలా వరకు పారిశ్రామిక ప్రాంతాలు నివాస ప్రాంతాలకు ఎంతో దూరంగా ఉంటుండేవి' అని మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 'పారిశ్రామిక, నివాస ప్రాంతాల విస్తరణతో ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పక్కపక్కనే నివసిస్తున్న పౌరులకు రెండు వేర్వేరు వాయు నాణ్యత ప్రమాణాలు ఉండజాలవు' అని ఆయన అన్నారు.
ఉదాహరణకుక పశ్చిమ ఢిల్లీ శివార్లలో పక్కపక్కనే ఉండే జనక్ పురి, మాయాపురి ప్రాంతాలు రెండూ సుమారు 240 యుజి/ఎం3 ఆర్ఎస్ పిఎం స్థాయిలో సమానంగా కాలుష్య ప్రదేశాలుగా ఉంటున్నాయి. అయినప్పటికీ జనక్ పురిని పారిశ్రామికేతర ప్రాంతంగా, మాయాపురిని పారిశ్రామిక ప్రాంతంగా వర్గీకరించారు. అందువల్ల జనక్ పురిలో గాలి అనుమతించిన స్థాయికి నాలుగింతలు కలుషితమవుతున్నట్లుగా పరిగణిస్తున్నారు. నగరంలో అత్యంత కలుషిత ప్రాంతంగా దీనిని తరచు పేర్కొంటుంటారు. కాగా మాయాపురిని అనుమతించిన స్థాయికి రెండింతలు మాత్రమే కలుషిత ప్రాంతంగా పరిగణిస్తున్నారు. వాస్తవానికి రెండు ప్రాంతాల వాసులు ఒకే తరహా గాలిని పీలుస్తుంటారు.
Pages: 1 -2- News Posted: 27 October, 2009
|