మౌనంగానే వైఎస్ మృతి న్యూఢిల్లీ : ఎలాంటి హెచ్చరిక లేకుండానే మృత్యువు విరుచుకుపడింది. క్షణాల్లోనే అంతా ముగిసిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ కన్నుమూసి తెరిచే లోగానే కుప్పకూలిపోయింది. ఐదుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. హెలికాప్టర్ లోని కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్)లోని సమాచారం ప్రకారం చివరి క్షణాలలో హెలికాప్టర్ లో ఎవరూ ఎటువంటి భయానికీ గురి కాలేదని తెలుస్తున్నది. ఈ సివిఆర్ సమాచారం కాపీని' టైమ్స్ ఆఫ్ ఇండియా' సంపాదించింది.
సెప్టెంబర్ 2న ఉదయం వర్షం కురుస్తున్న సమయంలో బెల్-430 హెలికాప్టర్ 2009 కొండను ఢీకొనడానికి కొన్ని క్షణాల ముందు దానిలో వైఎస్ఆర్ ఉల్లాసంగా, మౌనంగా సేద తీరుతూ ఉండవచ్చు. ఎందుకంటే సివిఆర్ లో ఆయన మాటలేవీ రికార్డు కాలేదు. తమ హెలికాప్టర్ దారి మళ్ళినట్లు సూచిస్తూ పైలట్లు ఆందోళనకరమైన సమాచారాన్ని ఏదీ పంపలేదు. అంటే హైదరాబాద్, చిత్తూరు మధ్య నిర్దేశిత మార్గం నుంచి హెలికాప్టర్ మళ్ళిన విషయాన్ని పైలట్లు గ్రహించనే లేదని దీని వల్ల విదితమవుతున్నది. ముందు ఏమి ఉన్నదో కూడా కనిపించనంతగా వర్షం కురుస్తున్న స్థితిలో హెలికాప్టర్ ముందుకు సాగింది. హెలికాప్టర్ 140 నాట్ల వేగంతో లేదా గంటకు దాదాపు 259 కిలో మీటర్ల (ఒక నాట్ 1.8 కెఎంపిహెచ్ తో సమానం) వేగంతో కొండను ఢీకొనే ముందు పైలట్లు దానిని కూడా చూడలేదు.
పైలట్ల మధ్య మామూలుగా సాగిన సంభాషణలు కూడా కొన్ని సివిఆర్ లో ఉండవచ్చు. కానీ సివిఆర్ లో ప్రమాదానికి ముందు ఎలాంటి సంభాషణలు రికార్డు కాలేదు. క్యాబిన్ లో సిఎం ఉన్నందున, ఆయన ఉల్లాసంగా సేద తీరుతున్నందు ఉన్నందున నిశ్శబ్ధాన్ని భగ్నం చేయడం ఇష్టం లేక పైలెట్లు మౌనం పాటించి ఉంటారని భావిస్తున్నారు. కాని ఈ మౌనాన్ని భంగపరుస్తూ హెలికాప్టర్ ఒక కొండను ఢీకొన్నప్పుడు అకస్మాత్తుగా చెవులు బద్దలయ్యేంత శబ్దం వెలువడింది. ఈ శబ్దం మాత్రం రికార్డయింది.
Pages: 1 -2- News Posted: 2 November, 2009
|