ఉప్పల్ లో చరిత్ర మారేనా? హైదరాబాద్ : నవంబర్ 5... భారత క్రికెట్ కే కాదు... ప్రపంచ క్రికెట్ క్రీడకు గర్వకారణమైన రోజు. 1989 నవంబర్ 5.. అంటే ఇరైవై సంవత్సరాల క్రితం సరీగ్గా ఇదే రోజున బిసిసిఐ ఎంపిక కమిటీ పదహారేళ్ళ బాలుడిని భారత క్రికెట్ జట్టుకు ఎంపిక చేసింది. పాకిస్తాన్ సీరీస్ కు పంపించింది. ఆ బాలుడే సచిన్ రమేష్ టెండూల్కర్ .. అలాంటి గర్వకారణమైన రోజున హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ధోనీ సేనతో ఆస్ట్రేలియా ఐదో వన్డే (డే/నైట్) మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో సచిన్ కేవలం ఏడు పరుగులు చేస్తే 17 వేల పరుగులను పూర్తి చేసి అరుదైన రికార్డును సృష్టిస్తాడు. కాగా వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న భారత్‌కు మొహాలీలో పాంటింగ్ సేన బ్రేక్ వేసి జట్టులో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపుకొంది. ఏడు వన్డేల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ముగిశాయి. ఇండియా-ఆస్ట్రేలియాలు 2-2తో సమంగా ఉన్నాయి. ఇక మిగిలింది మూడు వన్డేలు మాత్రమే. ఇందులో రెండు మ్యాచ్ లను నెగ్గిన జట్టే సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంక్‌ను పొందగలుగుతుంది.
తొలివన్డేలో ఓడినప్పటికీ ఆసీస్‌ను వణికించిన టీమిండియా ఆ తర్వాత రెండు,మూడు వన్డేల్లో ఆల్‌రౌండ్ ప్రతిభతో సత్తా చాటింది. ఐతే మొహాలీలో బౌలర్లు రాణించినప్పటికి గెలవాల్సిన మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ వైఫల్యం వల్ల ఓడిపోయిం ది. ఇక నేడు జరిగే మ్యాచ్ కీలకం కానుంది. ప్రపంచ భీకర ఓపెనర్లు సచిన్-సెహ్వాగ్‌లను కల్గి న టీమిండియాకు ఇప్పటి వరకు సిరీస్‌లో శుభారంభమే లభించలేదు. కనీసం 50 పరుగుల భాగస్వామ్యం కూడా లేదు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు వన్డేల్లో 25, 21, 37, 40 పరుగుల భాగస్వామ్యం మాత్రమే అందించారు.
మెడ గాయం కారణంగా నాలుగో వన్డేకు దూరం అయిన గంభీర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇక మిడిలార్డర్‌లో యువరాజ్-ధోనీలే కీలకపాత్ర వహిస్తున్నారు. సిరీస్‌లో భారత్ గెలిచిన రెండు విజయాల్లో వీరిదే కీలకపాత్ర. యువరాజ్ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే భారత్ మ్యాచ్‌పై అంత పట్టు సాధిస్తుంది. నాలుగో వన్డే ల్లో కీలకదశలో యువీ రనౌట్ కావడం మ్యాచ్‌నే ములుపు తిప్పింది. అలాగే సిరీస్‌లో టాస్ స్కోరర్‌గా ఉన్న ధోనీ కీలక సమయంలో నిలకడగా రాణిస్తున్నాడు. ఆరోస్థానంలో దిగుతున్న రైనా గత వన్డేలో తనను తాను నిరూపించుకొనేందుకు అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు కీలక సమయంలో రాణిం చాల్సి అవసరం ఎంతైనా ఉంది. చివరోల టైలెండర్లు హర్భజన్-ప్రవీణ్‌లు టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లా అదరగొడుతున్నారు.
Pages: 1 -2- News Posted: 4 November, 2009
|