కోట్ల డాలర్లతో చలి మంట! లండన్ : డబ్బు, డబ్బు, డబ్బు... పేరు మోసిన డ్రగ్ స్మగ్లర్ కు డబ్బు మీద వ్యామోహం పోయి విరక్తి పుట్టింది. మాదక ద్రవ్యాల వ్యాపారంలో గడించిన కోట్లాది రూపాయలతో అతను చలి మంట వేసుకున్నాడు. తనను వెంటాడుతున్న పోలీసులు, భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు కుటుంబంతో సహా మంచు పర్వతాల్లోని ఒక రహస్య స్థావరంలో తలదాచుకున్నఅతనికి పెద్ద చిక్కు వచ్చి పడింది. చలికి తట్టుకోలేక గడగడలాడిపోతున్న కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు ఒక్క రాత్రిలో 15 లక్షల డాలర్లకు పైగా విలువ చేసే కరెన్సీతో చలిమంట వేశాడు కొలంబియాకు చెందిన ఒక కొకెయిన్ స్మగ్లర్. అతని పేరు పాబ్లో ఎస్కోబార్.
హత్యకు గురైన మాదక ద్రవ్యాల వ్యాపారి పాబ్లో ఎస్కోబార్ అంతకుముందు భద్రతా దళాల నుంచి తప్పించుకు పారిపోతూ, వంట కోసం, తన కుమార్తెకు వేడి వాతావరణం కోసం రహస్య స్థావరంలో కోట్ల రూపాయల విలువ చేసే అమెరికన్ డాలర్ నోట్ల కట్టలను దగ్ధం చేసినట్లు ఎస్కోబార్ కుమారుడు 'కొలంబియన్' పత్రికకు చెప్పాడని బ్రిటిష్ టాబ్లాయిడ్ 'డైలీ మిర్రర్' తెలియజేసింది. జువాన్ పాబ్లో ఎస్కోబార్ అనే తన పేరును మార్చుకున్న సెబాస్టియన్ మరోక్విన్ ఆ ప్రముఖ పత్రిక విలేఖరితో మాట్లాడుతూ, తన కుమార్తె 'హైపోథెర్మియా' (శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోవడం) రుగ్మతతో బాధపడుతున్నదని భావించి తన తండ్రి ఆ డబ్బును దగ్ధం చేసినట్లు చెప్పారు.
మెడెలిన్ కార్టెల్ అధిపతి, 1989లో సుమారు 18 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్ ల సంపద ఉన్నట్లుగా భావించిన ఎస్కోబార్ ను ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తులలో ఏడవవాడిగా అమెరికన్ 'ఫోర్బ్స్' పత్రిక పేర్కొన్నది. వాస్తవానికి 1980 దశకంలో తన అధికారానికి ఎదురులేని సమయంలో ఎస్కోబార్ ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యాపారానికి, హత్యలకు ఆధ్వర్యం వహించాడు.
Pages: 1 -2- News Posted: 5 November, 2009
|