సిఎంలు ఏమయ్యారు? న్యూఢిల్లీ : బుద్ధదేవ్ భట్టాచార్జీ? ఉలుకూ పలుకూ లేదు.
నితీశ్ కుమార్? అదే పరిస్థితి.
రమణ్ సింగ్? మౌనం.
కె.రోశయ్య? మళ్ళీ మౌనం.
శివరాజ్ సింగ్ చౌహాన్? లేరు.
నవీన్ పట్నాయక్? ఉన్నాను సార్!
హమ్మయ్య!
బుధవారం ఉదయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఊరట చెందారంటే ముందు సీటు విద్యార్థులు క్లాసుకు రాని ప్రొఫెసర్లు ఆయన పరిస్థితికి సానుభూతి చెందగలరు. గిరిజన సంక్షేమం ద్వారా మావోయిస్టులను ఎదుర్కొనే వ్యూహంపై తమ భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు రాగలరని ఆశించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులలో నవీన్ పట్నాయక్ మినహా మరెవరూ రాలేదు. అటవీ హక్కులు, గిరిజన అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిమిత్తం ముఖ్యమంత్రులు, రాష్ట్ర (అటవీ, గిరిజనాభివృద్ధి శాఖల) మంత్రుల సదస్సు ఏర్పాటు చేశారు. రెండు రోజుల సదస్సు ఇది.
రకరకాల స్థాయిలలో నక్సలైట్ల ఉనికి ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, బెంగాల్, బీహార్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒరిస్సాల ముఖ్యమంత్రులను ఈ సదస్సుకు హాజరు కావలసిందిగా తమ శాఖ ప్రత్యేకంగా కోరినట్లు కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రధాని ఈ సదస్సును ప్రారంభించారు.
'ఈ సదస్సుకు హాజరు కావలసిందిగా నక్సల్ బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాం. గిరిజనులకు, తక్కిన ప్రపంచానికి ఇది సరైన సంకేతాలను పంపగలదని మేము ఆశించాం. కాని ఒరిస్సా ముఖ్యమంత్రి మినహా మరెవరూ హాజరు కాలేదు' అని ఆ అధికారి చెప్పారు. 'అటవీ హక్కుల చట్టానికి సవరణలు కోరుతూ వారం విడిచి వారం మాకు లేఖలు రాస్తుండే బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాలు కూడా ఈ సదస్సుకు తమ ముఖ్యమంత్రులను పంపేందుకు శ్రద్ధ వహించలేదు. ఈ చట్టానికి సంబంధించిన అంశాలన్నిటిపై ఈ సదస్సులో చర్చించారు' అని ఆ అధికారి చెప్పారు.
Pages: 1 -2- News Posted: 5 November, 2009
|