అనార్కలీ...జస్ట్ లక్షే! హైదరాబాద్ : ఒకటా... రెండా ఏకంగా ఆరు వేల రూపాయలు.ఒక డిజిటల్ కెమేరా కొనొచ్చు. ఏదైనా మెట్రో నగరంలో ఒక రాత్రికి ఒక స్టార్ హోటల్ రూమ్ లో బస చేయవచ్చు లేదా విమాన ప్రయాణానికి టిక్కెట్లు కొనవచ్చు. ఒక కుటుంబం నెలంతా బతికేయవచ్చు. కానీ మీరో బటర్ చికెన్ రుచి చూడాలని ఉవ్విళ్లూరితే మాత్రం జస్ట్ ఆరు వేల రూపాయల పెట్టాల్సిందే. ఈ చికెన్ హైదరాబాద్ లోని అనార్కలిలో దొరుకుతుంది. అయితే, దీని కోసం ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేయవలసి ఉంటుంది. ఒక ఎస్ఎంఎస్ సొల్యూషన్స్ సంస్థను నిర్వహిస్తున్న ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ బటర్ చికెన్ ను అత్యంత రుచికరంగా వండే ప్రత్యేక ప్రక్రియను తాను రూపొందించినట్లు చెప్పారు. ప్రపంచంలో ఏ హోటల్ లోనైనా భారతీయ వంటకాల జాబితాలో కనిపించే తినుబండారం బటర్ చికెన్.
అనార్కలికి సూత్రధారుడైన ఇరాన్ లో జన్మించిన భారతీయుడు ఇరాన్ భారత్ సక్సేనాకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకం బటర్ చికెన్. 'ఎనిమిదేళ్ల పాటు ప్రయోగాలు చేసిన అనంతరం దీనిని అత్యంత రుచికరంగా తయారుచేసే పద్ధతిని కనుగొన్నాను' అని సక్సేనా చెప్పారు. తన ఫేవరైట్ సినిమా హీరోయిన్ 'మొగల్-ఎ-ఆజమ్' నాయిక అనార్కలి పేరును ఆయన ఈ వంటకానికి పెట్టారు. ఆ చిత్రం వలె సక్సేనా సృష్టించిన బటర్ చికెన్ కూడా అత్యంత ప్రియమైనదే. దీని ఖరీదు రూ. 6000. ఈ చికెన్ ను సిసలైన బంగారం, వెండి ఫాయిల్ లో సప్లయి చేస్తారు. దీనిని ఇద్దరికి సర్వ్ చేయవచ్చు. (అప్పట్లో ఆ చిత్ర నిర్మాణానికి అత్యధికంగా ఖర్చు చేశారు.)
బటర్ చికెన్ ను వండడం తనకు హాబీ అని, తాను, తన బృందం తాము సృష్టించిన ఈ వంటకం ద్వారా డబ్బు సంపాదించాలని గాని, దండిగా లాభాలు ఆర్జించాలని గాని కోరుకోవడం లేదని సక్సేనా స్పష్టం చేశారు. 'చివరకు ప్రస్తుత ప్యాకేజీలో కూడా చారిటీ కోసం కస్టమర్ కు మేము మా వంటకంతో పాటు రూ. 800 (నగదుగా) తిరిగి పంపుతాం' అని ఆయన తెలిపారు.
'www.anaarkali.in' అనే వారి వెబ్ సైట్ లో ఈ చికెన్ తయారీకి ఉపయోగించిన దినుసులు, ఖరీదుల వివరాలు పొందుపరిచారు. ప్రమోటర్లు మార్జిన్ గా 33.39 శాతం, అంటే రూ. 1736.72 మేరకు అట్టిపెట్టుకుంటున్నట్లు వెబ్ సైట్ తెలియజేస్తున్నది. 'మా ఎనిమిది సంవత్సరాల పరిశోధన, ప్రయోగాలకు అయిన ఖర్చు అది' అని సక్సేనా తెలిపారు. 'ప్రతిదీ స్వయంగా చేసి, చేతితో తయారు చేసిన కంటైనర్ లో కస్టమర్ కు పంపుతున్నాం' అని ఆయన తెలిపారు.
Pages: 1 -2- News Posted: 9 November, 2009
|