తూర్పుకే తుపాను తిప్పలు న్యూఢిల్లీ : బంగళాఖాతంలోనే తుపానులు ఎందుకు ఎక్కువ. అవి తరచు విరుచుకు పడుతూ ప్రజల బతుకులను అతలాకుతలం చేస్తున్నాయి. ఎందుకంటే బంగాళాఖాతంలో అనుకూల వాతావరణ ఉండడం, తూర్పు తీరంలో సమతల ప్రదేశాలు ఎక్కువగా ఉండడం కారణంగా అరేబియా సముద్రంలో కన్నా బంగాళా ఖాతంలోనే అత్యంత తరచుగా, మరింత తీవ్ర స్థాయిలో తుపానులు సంభవిస్తుంటాయని తుపాను కదలికలను పరిశీలిస్తున్న వాతావరణ శాస్త్రజ్ఞులు తెలియజేశారు.
తాజాగా పశ్చిమ తీరాన్ని దాటిన ఫైయాన్ తుపాను ప్రభావంతో గంటకు దాదాపు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇంతకుముందు ఈ సంవత్సరం మే నెలలో బంగాళాఖాతంలో సంభవించిన ఐలా తుపాను ప్రభావంతో గంటకు 120 కిలో మీటర్లకు మించిన వేగంతో గాలులు వీచాయి.
'బంగాళాఖాతంలో నాలుగు పర్యాయాలు తుపానులు సంభవిస్తే, అరేబియా సముద్రంలో ఒకసారి తుపాను వస్తుంటుందని చారిత్రక రికార్టులు సూచిస్తున్నాయి' అని న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ (ఐఎండి)లో తుపాను హెచ్చరిక విభాగం సైంటిస్ట్ బసబ్ బందోపాధ్యాయ చెప్పారు. అరేబియా సముద్రంపైన, బంగాళాఖాతంపైన ఉష్ణ ప్రసరణ తరంగాల సరళిలో ఉండే స్వల్ప వ్యత్యాసాల వల్ల బంగాళాఖాతంలోనే ఎక్కువ తరచుగా తుపానులు సంభవించడానికి కారణమవుతాయని సైంటిస్టులు అంటున్నారు.
సంవత్సరంలో చాలా భాగం అరేబియా సముద్రంపై పెద్ద ఎత్తున అధోముఖంగా గాలి కదలిక ఉంటుందని, ఉష్ణప్రసరణ తరంగాలకు పెరిగి, తుపానులుగా తీవ్ర రూపం దాల్చే అవకాశం బాగా తక్కువగా ఉంటుందని పుణెలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియారాలజీ సైంటిస్ట్ కె. కృష్ణకుమార్ వివరించార
Pages: 1 -2- News Posted: 12 November, 2009
|