ఆ భవనం ఇక భద్రం న్యూఢిల్లీ : సూర్యడస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అంతాన్ని చూసింది, ఉగ్రవాద ముష్కరుల దాడికి తట్టుకుని నిలబడింది. 13 మంది ప్రధానులకు ఆతిథ్యం ఇచ్చింది. డజనుకుపైగా ప్రభుత్వాలను కూడా చూసింది. ఇప్పుడు ఆ భవనం గోడలలో మేకులు దింపడానికి కూడా దాని సంరక్షకుల అనుమతి అవసరం అవుతుంది. ఆ భవనం వయస్సు ఇప్పుడు 82 సంవత్సరాలు. అదే భారత పార్లమెంట్ భవనం.
పార్లమెంట్ భవనం వారసత్వ సంపద ప్రతిపత్తిని సంరక్షించాలన్నసంకల్పంతో లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ప్రతిపాదించిన ప్రణాళికకు గురువారం అఖిల పక్ష సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోద ముద్ర లభించింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఒకటి పార్లమెంట్ భవనం నిర్వహణ, మరమ్మతులను పర్యవేక్షించాలనే ప్రతిపాదనకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు అంగీకరించారు. 'ఇప్పుడు ఒక మేకు దింపాలన్నా కమిటీ అనుమతిని కోరవలసి ఉంటుంది' అని సమావేశానంతరం మీరా కుమార్ తెలియజేశారు.
1927లో నిర్మితమైన పార్లమెంట్ భవనంలో ఇటుకలు, కాంక్రీట్ ఇటీవలి కాలంలో అప్పుడప్పుడు ఊడి పడిపోతుండడంతో భవనం గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా జెపిసికి ఈ బాధ్యతను అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ స్పీకర్ అధ్యక్షత వహించే జెపిసి సాంకేతిక సలహా కమిటీ సాయంతో భవనం నిర్వహణను పర్యవేక్షిస్తుంది. సలహా కమిటీకి లోక్ సభ సెక్రటరీ జనరల్ సారథ్యం వహిస్తారు. ఈ కమిటీలో ప్రముఖ ఆర్కిటెక్ట్ లు, చరిత్రవేత్తలు, భారత జాతియ కళ, సాంస్కృతిక వారసత్వ సంపద ట్రస్ట్ కు, జాతీయ మ్యూజియానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు.
Pages: 1 -2- News Posted: 13 November, 2009
|