సిగ్గా? సీక్రేటా? సలహా 'ఫ్రీ' న్యూఢిల్లీ : గర్భం దాల్చడం, పుష్పవతి కావడం లేదా యుక్తవయస్కతకు సంబంధించిన ప్రశ్నలు లేదా పక్షులు, ఈగలు గురించిన సాధారణ విషయాలపై ప్రశ్నలు మీ మెదళ్ళను తొలుస్తున్నాయా? మీ తల్లిదండ్రులను లేదా స్నేహితులను ఈ ప్రశ్నలు అడగడానికి సిగ్గు పడుతున్నారా? సీక్రేటని భయపడుతున్నారా? పోనీ సంకోచిస్తున్నారా? అలా అయితే, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు డయల్ చేయండి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన జన్ సంఖ్య స్థిరత కోశ్ (జెఎస్ కె) లేదా జాతీయ జనాభా స్థిరీకరణ నిధి (ఎన్ పిఎస్ఎఫ్) నిర్వహిస్తున్న హెల్ప్ లైన్ (1800-11-6555 లేదా 011-6666-5555)కు మీ సందేహల నివృత్తి కోసం ఫోన్ చేయవచ్చు. ఈ హెల్ప్ లైన్ కు సాయం చేస్తున్న ఒక డాక్టర్ మాట్లాడుతూ, 'టోల్ ఫ్రీ నంబర్ గుర్తు పెట్టుకోవడానికి తేలికగా ఉంటుంది. జనం అడగాలనుకున్నా సిగ్గుతో నేరుగా అడగలేని ప్రశ్నలన్నిటికీ అజ్ఞాతంగా విశ్వసనీయమైన సమాచారాన్ని ఇది అందజేస్తుంది' అని చెప్పారు.
ఇప్పటికే రోజూ 300 పైచిలుకు కాల్స్ వస్తున్నాయి. ఈ హెల్ప్ లైన్ ను ప్రధానంగా హిందీ భాష మాట్లాడే ప్రాంతాలకు ఉద్దేశించారు. వారంలో ఆరు రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు హిందీ, ఇంగ్లీషులలో సమాచార సేకరణకు ఈ నంబర్లు అందుబాటులో ఉంటాయి. 2008 జూన్ లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ ను ఈ సంవత్సరం మార్చిలో టోల్ ఫ్రీ చేశారు.
'పురుషులు, మహిళల నుంచి ఈ హెల్ప్ లైన్ నంబర్ పై మాకు కాల్స్ వస్తుంటాయి. గర్భనిరోధానికి సురక్షిత పద్ధతి, అవాంఛిత గర్భం వంటి అంశాలపై రోజుకు 300పైగా కాల్స్ మాకు వస్తుంటాయి' అని ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన కమ్యూనికేషన్ ఆఫీసర్ శాలినీ శుక్లా చెప్పారు. 'మేము ఈ హెల్ప్ లైన్ గురించి చాలా తక్కువగానే అడ్వర్టైజ్ చేశాం. అయినప్పటికీ మాకు మంచి స్పందన లభించింది. జనం ఈ విషయాలు తెలుసుకోవాలని అభిలషిస్తున్నారు. సెక్స్ విద్యపై మన సమాజంలో అంతరం, ఆక్షలు ఏమేరకు ఉన్నాయో ఇది సూచిస్తున్నది' అని శాలినీ శుక్లా పేర్కొన్నారు.
టీనేజ్ తల్లులు లేదా అవివాహితలు, నవ దంపతులలో గర్భనిరోధం, సురక్షిత గర్భస్రావం, గర్భం, సుఖవ్యాధులు, శిశు, పిల్లల ఆరోగ్య సమస్యలు వంటి విషయాలపై సమాచారం అందజేయడం ఈ హెల్ప్ లైన్ లక్ష్యమని శాలినీ శుక్లా తెలియజేశారు. 'మాకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. అందుకే హెల్ప్ లైన్ నంబర్ ను టోల్ ఫ్రీ చేశాం. ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలలో సమాచార లోపం ఎక్కువగానే ఉన్నది. ఆ రాష్ట్రాలలో ఇటువంటి సమాచారం తేలికగా లభించదు' అని శుక్లా వివరించారు.
Pages: 1 -2- News Posted: 16 November, 2009
|