సూర్యుణ్ణుంచే విద్యుత్ టోక్యో : కరెంటును ఉత్పత్తి చేయడానికి బొగ్గు, నీరు, న్యూక్లియర్ ప్రక్రియ ఇవన్నీ మానవాళి వనరులను నాశనం చేస్తున్నాయి. పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. అందుకే జపాన్ ఏకంగా సూర్యుణ్ణించే కరెంటు తెచ్చుకుంటే పోలా అనుకుంది. ఇది సైన్స్ ఫిక్షన్ ప్రణాళికలా కనిపించవచ్చు. కాని జపాన్ రోదసి సంస్థ చాలా పట్టుదలతో ఉన్నది. 2030 సంవత్సరానికల్లా అంతరిక్షంలోనే సౌర విద్యుత్ శక్తిని సేకరించి లేజర్ బీమ్ లు లేదా మైక్రో తరంగాల ద్వారా భూతలానికి ప్రసారం చేయాలని ఈ సంస్థ అభిలషిస్తున్నది. ఆశావహమైన, వందల బిలియన్ డాలర్లు వ్యయం కాగల ఈ ప్రాజెక్టుతో అపరిమితమైన పరిశుద్ధమైన విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే కలను రానున్న దశాబ్దాలలో వాస్తవం చేసే బాధ్యతను జపాన్ ప్రభుత్వం కొన్ని సంస్థలకు, పరిశోధకుల బృందానికి అప్పగించింది.
సౌర విద్యుత్, ఇతర విధాల రెన్యూయబుల్ విద్యుత్ ఉత్పాదన, వాడకంలో జపాన్ చాలా కాలంగా అగ్ర స్థానంలో ఉన్నది. గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గింపునకు జపాన్ ఈ సంవత్సరం భారీ లక్ష్యాలనే నిర్దేశించుకున్నది. అంతరిక్షంలో సౌర విద్యుదుత్పాదక వ్యవస్థ (ఎస్ఎస్ పిఎస్)కు జపాన్ అత్యంత సాహసంతో శ్రీకారం చుడుతున్నది. ఇందులో అనేక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఫోటోవోల్టాయిక్ డిష్ లు భూ వాతావరణానికి ఆవల భూస్థిర కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. 'సౌర విద్యుత్ పరిశుద్ధమైన, ఎప్పటికీ తరగని ఇంధన వనరు కనుక విద్యుత్ కొరత, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యల పరిష్కారనికి ఈ వ్యవస్థ దోహదం చేస్తుందని మా విశ్వాసం' అని ఈ ప్రాజెక్టులో పాలు పంచుకుంటున్న సంస్థలలో ఒకటైన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ (ఎంహెచ్ఐ)లో పరిశోధకులు ఒక నివేదికలో తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 16 November, 2009
|