భారతీయ 'మమత' పార్టీ! న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) పేరును మార్చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్ణయించిందనుకోండి...అప్పుడు ఆ పేరు ఏమవుతుంది? భారతీయ హిందుత్వ పార్టీ? హిందుత్వ దళ్? అవేమీ కావు. భారతీయ తృణమూల్ పార్టీ? కావచ్చు.
తన రాజకీయ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించే పనిలో సంఘ్ తల మునకలు కాగా, 'తృణమూల్ కాంగ్రెస్ దృక్పథం, వ్యూహంలోని మౌలికాంశాలను ప్రాతిపదికగా తీసుకోవాల'ని సంఘ్ అభిలషిస్తున్నట్లు ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రతినిధి ఒకరు తెలియజేశారు. 'ప్రజల సమస్యలను, వారి ఆగ్రహానికి లక్ష్యాన్ని, అధికార సంకీర్ణానికి వ్యతిరేకంగా వారి మనోభావాలను సరైన మార్గంలో మళ్ళించగల వ్యక్తులను గుర్తించి వారిని నాయకులుగా మలచడం ద్వారా పునాదుల నుంచి పార్టీని నిర్మించుకురావడంపై మమతా బెనర్జీ దృష్టి నిలిపారని మా భావన. ఢిల్లీలోని అగ్రశ్రేణి నాయకత్వానికే ప్రాముఖ్యం ఇవ్వాలనే తన ధోరణిని బిజెపి విడనాడి అట్టుడుగు స్థాయి నుంచి పటిష్ఠం చేసుకుంటూ రానిదే పార్టీ భవిష్యత్ పై ఆశలు పెట్టుకోవడం అనవసరం. తృణమూలు ఎన్నో విధాల ప్రత్యేకతను కలిగి ఉన్నది' అని ఆయన పేర్కొన్నారు.
అయితే, మమత చుట్టూ తిరిగే తృణమూల్ వలె కాకుండా రాజనాథ్ సింగ్ అనంతర దశలో బిజెపికి ఎల్.కె. అద్వానీ గాని, ఆయన హంగుదారులు గాని కాకుండా తాను, ముఖ్యంగా సంఘ్ అధినేత మోహనరావు భాగవత్ కేంద్రకం కావాలని ఆర్ఎస్ఎస్ ఆకాంక్షిస్తున్నది. బిజెపికి కాబోయే అధ్యక్షుడు నితిన్ గడ్కరి కూడా కేంద్రకం కాకూడదు. వాస్తవానికి గడ్కరిని ఉరఫ్ భాగవత్ గా పరిగణించవచ్చు.
Pages: 1 -2- News Posted: 18 November, 2009
|