చైనీయుల 'పవర్' దెబ్బ న్యూఢిల్లీ : చైనా తన 'పవర్' ను రుచి చూపించింది. భారత్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై చైనీయులు మంచి దెబ్బ కొట్టారు. దేశంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్న దాదాపు మూడు వేల మంది చైనా నిపుణులు ఒక్కసారిగా దేశంలో వదిలిపోయారు. దీని వల్ల దేశంలో విద్యుదుత్పాదక సామర్థ్యానికి 30 వేల మెగావాట్లను అదనంగా చేర్చే కార్యక్రమానికి విఘాతం కలగగలదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ హెచ్చరించింది. కారణం - హోమ్ మంత్రిత్వశాఖ విధించిన కొత్త వీసా నిబంధనలు, కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ విధించిన కొత్త శ్రామిక నిబంధనలు.
'30 వేల మెగావాట్ల సామర్థ్యం మేరకు పెక్కు విద్యుత్ ప్రాజెక్టులను చైనీస్ కంపెనీల సహకారంతో నిర్మిస్తున్నారు' అని విద్యుత్ శాఖ కార్యదర్శి హెచ్.ఎస్. బ్రహ్మ నవంబర్ 17న క్యాబినెట్ కార్యదర్శి కె.ఎం. చంద్రశేఖర్ కు రాసిన ఒక లేఖలో తెలియజేశారు. 'బిజినెస్ వీసాలతో ఈ ప్రాజెక్టుల వద్ద పని చేస్తున్న చైనీస్ సిబ్బందిని తిరిగి పంపివేశారు. దీని వల్ల నిర్మాణ పనులకు, ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభించే కార్యక్రమాలకు అంతరాయం కలిగింది' అని బ్రహ్మ తన లేఖలో వివరించారు.
వాటిలో 4000 మెగావాట్ల ప్రాజెక్టులలో 'ఉత్పత్తి ప్రారంభించే పనులకు తక్షణం చైనీస్ ఇంజనీర్ల సేవలు కావలసి ఉంది' అని ఆయన తన లేఖలో తెలిపారు. హోమ్ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి ఉన్నప్పటికీ బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం చైనీస్ ఇంజనీర్లకు ఉద్యోగ వీసాలు ఇవ్వడం లేదని బ్రహ్మ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 23 November, 2009
|