9 మందికి 36 వేల బుల్లెట్లు! ముంబయి : ఒక్క మనిషిని చంపడానికి ఎన్ని బుల్లెట్లు కావాలి? మీకు తెలుసా? అక్షరాలా నాలుగు వేల బుల్లెట్లు కావాలి. జరిగింది ఇదే. ఏడాది క్రితం ముంబయిలో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి పోలీసులు, జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్ జి), నౌకాదళం కమెండోలు కాల్చిన బుల్లెట్ల సంఖ్య 36 వేలని విచారణలో తేలింది. సంవత్సరం తరువాత ముంబయి దాడికి సంబంధించి బయటపడుతున్న విస్మయకర అంశాల్లో ఇదీ ఒకటి. మొత్తం పది మంది ఉగ్రవాదులు ఎకె 47, గ్రెనేడ్లతో రక్తపాతానికి తెగబడ్డారు. 62 గంటల సుధీర్ఘ పోరాటం తరువాత వీరిలో తొమ్మిది మందిని పోలీసులు చంపేశారు. అజ్మల్ కసబ్ ను ప్రాణాలతో పట్టుకున్నారు.
ఈ పది మందినీ మట్టుబెట్టడానికి పోలీసులు మొత్తం ఆరు చోట్ల మోహరించారు. కానీ ఆయుధాలు లేక ముంబయి పోలీసులు నానా అగచాట్లు పడ్డారు. కాలం చెల్లిన తుపాకులు, తుప్పట్టిపోయిన బుల్లెట్లతో వారు ప్రాణాలను ఫణంగా పెట్టి తీవ్రవాదులతో కలబడ్డారు. ఈ పోలీసులకు ఇచ్చిన బుల్లెట్లను కూడా పదేళ్ళ క్రితం కొనుగోలు చేసి దాచినవని బయటపడింది. వాటిలో కొన్ని బుల్లెట్లు అసలు పేలనే లేదని తేలింది. ఈ ఆపరేషన్ ను మంచి ఆయుధాలతో వ్యూహత్మకంగా నిర్వహించవలసింది. కానీ అలా జరగలేదని పోలీసు అధికారులు ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నారు.
Pages: 1 -2- News Posted: 27 November, 2009
|