'మ్యూజిగల్' ఆరంభం
a.gif)
హైదరాబాద్ : ఇంటర్నెట్ లో ఇంగ్లీషు పాటలే కాదు హృదయాలను ఉర్రూతలూగించే, మనస్సులను రంజింపచేసే మధురమై తేటతెలుగు సంగీతాన్నీ ఇకపై వినవచ్చు. ఇప్పటికే స్టార్లైపోయిన షకీరాలు, మడోన్నాల పక్కనే మన మారుమూల కీకారణ్యంలో అమాయక గిరిజన యువతి పాడే అద్భుత ప్రకృతి గీతాన్నీ ఆలకించవచ్చు. వీక్షించనూ వచ్చు. స్వరాలను సుమధురంగా పలికించే గొంతులు, పదాలను హృద్యంగా కూర్చగలిగే కొత్త కవులు, నర్తనతో నరాలను కుదపగలిగే గ్రామీణ ప్రతిభావంతులు ఎందరో ఇలా మరెందరో అవకాశాలు లేక మరుగున పడిపోతున్న ప్రతిభావంతులను విశ్వవేదికపై నిలబెట్టే పోర్టల్ మ్యూజిగల్ డాట్ కామ్ సైబర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. భారతీయ సంగీతాన్ని ప్రపంచ సంగీత అభిమానులకు అందించే లక్ష్యంతోనే ఈ వినూత్న వెబ్ సైట్ కు రూపకల్పన చేసామని మ్యూజిగల్ సంస్థ సీఈఓ ఆనంద్ కూచిభొట్ల వివరించారు.
బంజారాహిల్స్ లోని ప్రసాద్ లాబ్స్ లో ప్రముఖ 'లలిత సంగీత ప్రయోక్త' శ్రీ పాలగుమ్మి విశ్వనాధం, రావు బాలసరస్వతి చేతుల మీదుగా ఆదివారం మ్యూజిగల్ ప్రారంభమైనది. కార్యక్రమంలో, ఛైర్మెన్ షాన్ అప్పజోడు, దీపక అప్పజోడు, సినీ సంగీత దర్శకులు, దేశంలోని పలు ప్రాంతాల నుంచీ వచ్చిన సంగీత కళాకారులు, వాద్య కళాకారులు, స్లం డాగ్ మిలియనీర్ చిత్రానికి రహమాన్ తో పనిచేసిన సంగీత దర్శకుడు ప్రవీణ్ మణి, కోటి , కూచిపూడి రాధారెడ్డి రాజారెడ్డి, శ్రీ జొన్న విత్తుల, గజల్ శ్రీనివాస్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, కోడి రామకృష్ణ, రామాచారి, రఘు కుంచె, భాస్కర భట్ల రవికుమార్, ఎల్.వి.సుబ్రహ్మణ్యం, గంగాధర్, ఎ.వి.ఎస్, కళ్యాణి మాలిక్, జూనియర్ రేలంగి, బంటీ, సందీప్, భార్గవ్, మల్లాది బ్రదర్స్, రవివర్మ, జొన్నవిత్తుల ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ఔత్సాహిక సంగీత కళాకారులు పాల్గొన్నారు.
మ్యూజిగల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంతా ఉత్సాహభరితంగా సాగింది. వృద్ధాప్యంలో కూడా పాలగుమ్మి పద్మరాజు 'పంటచేల గట్ల మీద నడవాలి' పాటను అద్భుతంగా పాడి వినిపించారు. రావు బాలసరస్వతి చందమామ పాట శ్రోతలను ముగ్ధులను చేసింది. మ్యూజిగల్ కోసం గాయత్రీ సిస్టర్స్ స్వరపరిచిన ప్రత్యేక సంగీతం అందరినీ ఆకట్టుకుంది. సిరివెన్నెల చమక్కులు, మాజీ ఐఎఎస్ అధికారి పివిఆర్ కె ప్రసాద్ చతురోక్తిగా చెప్పిన సూచనలు, యువ గాయకులకు సినీ సంగీత దర్శకుడు కోటి ఇచ్చిన సలహాలు తో నడిచిన ఈ కార్యక్రమం మ్యూజిగల్ విశిష్టతకు చిహ్నంగా నిలచింది.
Pages: 1 -2- News Posted: 30 November, 2009
|