ముఖ్యమంత్రిగా గీతారెడ్డి?
న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనుగొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చురుగ్గా వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రిని మార్చాలని భావిస్తోంది. గడచిన 48 గంటలలో రాష్ట్ర రాజకీయాలలో నాటకీయమైన రీతిలో సంభవించిన పరిణామాలు మళ్ళీ నాయకత్వ మార్పునకు తెర తీయబోతున్నాయి. రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన గీతా రెడ్డిని నియమించడానికి పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది.
2009 అసెంబ్లీ ఎన్నికలలో మెదక్ జిల్లా జహీరాబాద్ (ఎస్సీ) నుంచి ఎన్నికైన గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, వివాదరహితులుగాను పేరుంది. గీతారెడ్డి తల్లి ఈశ్వరీభాయి సైతం కాంగ్రెస్ లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఎస్సీ కులానికి చెందిన గీతారెడ్డి గతంలో మూడుసార్లు మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన గీతారెడ్డి, చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
Pages: 1 -2- News Posted: 10 December, 2009
|