పట్టుపట్టిన రాహుల్ న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో ప్రతి పదవికి అంటే బ్లాక్ స్థాయి నుంచి అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ వర్కింగ్ కమిటీ వరకు ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయించింది. జనవరి వచ్చిందంటే పార్టీ రాష్ట్ర శాఖ (పిసిసి)ల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లను ఎన్నుకుంటారు కాని నామినేట్ చేయరు.
పార్టీ నియమావళి ప్రకారం, ఈ పదవులకు ఎన్నికల నిర్వహణ తప్పనిసరి. కాని గడచిన పది పదిహేను సంవత్సరాలుగా ఆంతరంగిక ప్రజాస్వామ్యం అనే ముసుగును కూడా తొలగించారు. దాదాపు ప్రతి నియామకాన్ని అధిష్ఠానమే జరుపుతోంది. ఇక ఆ పద్ధతి అంతా మారబోతున్నది. పారదర్శకత కోసం, తద్వారా ప్రజాస్వామ్య పద్ధతి కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధి ఒత్తిడి తీసుకువస్తుండడమే ఇందుకు కారణం.
'(పార్టీ విద్యార్థి విభాగం) ఎన్ఎస్ యుఐలోను, యువజన కాంగ్రెస్ లోను పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు రాహుల్జీ శ్రీకారం చుట్టారు. అనేక రాష్ట్రాలలో ఈ పార్టీ విభాగాలకు అసలు సిసలైన ఎన్నికలు జరిగాయి. ప్రతిభను ప్రోత్సహించడానికి, కొత్త నాయకత్వాన్ని నిర్మించడానికి అది అత్యుత్తమ మార్గం. కాంగ్రెస్ ప్రధాన సంస్థలో ఈ ప్రక్రియను నిర్వహించకుండా దీర్ఘకాలం ఉండలేము. అందువల్ల వచ్చే సంవత్సరం నుంచి ఇందుకు శ్రీకారం చుట్టాలని నిశ్చయించాం' అని పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు 'ది టెలిగ్రాఫ్' విలేఖరితో చెప్పారు.
సంస్థాగత ఎన్నికలు జనవరిలో మొదలై డిసెంబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నికతో ముగుస్తాయి. అధిష్ఠానవర్గం గాని, రాష్ట్రాలలో పాతుకుపోయిన నేతలు గాని అప్పటికీ తమకు ఇష్టులైన వారిని పదవులలోకి తీసుకువచ్చేందుకు వీలు కలుగుతుంది కాని సిసలైన నేతలను పూర్తిగా తొక్కిపెట్టి ఉంచడం ఎన్నికల వల్ల కష్టం కాగలదు.
సంస్కరణల ప్రక్రియ వల్ల రాష్ట్రాలలో నాటకీయ మార్పులు రాగలవని పార్టీ వర్గాలు సూచించాయి. కేంద్ర నాయకులను సులభంగా ఆశ్రయించగల, లాబీ చేస్తూ ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడుపుతుండే వారు సాధారణంగా పిసిసి పదవులను చేజిక్కుంచుకుంటుంటారు. 'వచ్చే సంవత్సరం నుంచి ఎన్నికైన పిసిసి అధ్యక్షులే ఉంటారని మా ఆశ' అని సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 14 December, 2009
|