'సెపరేట్' బిజెనెస్ హైదరాబాద్ : 'సమైక్య ఆంధ్ర', 'ప్రత్యేక తెలంగాణ' - ఈ నినాదాలు చేస్తున్నది రాజకీయ నాయకులు మాత్రమే కాదు. రచయితలు, గాయకులు, సినీ నిర్మాతలు, దర్శకులకు కూడా ఇవి స్ఫూర్తి ఇస్తున్నాయి. వీటిని మరింత పాపులర్ చేసేందుకు వారు తమ సృజనాత్మక సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఈ నినాదాలను, ప్రజల సెంటిమెంట్ ను మరింత బలంగా వ్యక్తం చేయడానికి తమలోని క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. మరి కొందరు కాదేదీ వ్యాపారానికి అనర్హం అంటూ సిడీలు, బ్యాడ్జ్ లు, ఇతర ప్రచార సమాగ్రిని రూపొందిస్తున్నారు. సెపరేట్(తెలంగాణ, సమైక్యాంధ్ర) అంశంతో కండువాలు, టీచొక్కాలు, టోపీలు ఇత్యాదులు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి.
కొందరు వెబ్ సైట్లు ప్రారంభించారు. మరికొందరు యూట్యూబ్ లో వీడియోలు పొందుపరుస్తున్నారు. ఇంకా కొందరు చిత్రాలు నిర్మిస్తూ ఆల్బమ్ లు వెలువరిస్తున్నారు. వాస్తవానికి ఈ అంశంపై కనిపిస్తున్న స్పందనను రాష్ట్రంలో ఎన్నికలు కలిగించేంతటి ఉత్సుకతతో పోల్చవచ్చు. అయితే, ఇది మరింతగా హృదయాంతరాలలో నుంచి వస్తున్న స్పందన.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న ఎంబిఎ గ్రాడ్యుయేట్ అరుణ్ వర్మ ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వీలుగా http://samaikyaandhra.org అనే వేదిక ఒకదానిని ప్రారంభించారు. 'మీడియా పక్షపాత వైఖరిని అనుసరిస్తున్నది. మేము మా అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని అనుకుంటున్నాం. మా మాట కూడా వినిపించడానికి వీలుగా ఒక వెబ్ సైట్ ప్రారంభించాం' అని అరుణ్ వర్మ తెలిపారు. 'నేను ఒక ఎస్ఎంఎస్ సర్వీస్ క కూడా శ్రీకారం చుట్టుతున్నాను. నేను సమగ్రంగా ఒక పత్రం రూపొందించి ప్రధాని కార్యాలయం (పిఎంఒ)కు పంపుతాను. సమైక్యంగా ఉండాలని ఆకాంక్షించేవారి కోసం ఒక వేదికను సమకూర్చాలని మా లక్ష్యం' అని వర్మ తెలియజేశారు.
ఈ వారం చాలా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులు సమైక్య రాష్ట్రం కోసం జరుగుతున్న ప్రచారానికి పోటీగా ఒక వెబ్ సైట్ ను సృష్టించాలని యోచిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు) విద్యార్థులు ఇప్పటికే www.vote4Telangana.com అనే వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం చరిత్ర గురించిన, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత గురించిన వివరాలు ఈ వెబ్ సైట్ లో ఉన్నాయి.
Pages: 1 -2- News Posted: 16 December, 2009
|