సరిహద్దు 'సమైక్యం' చిత్తూరు : సమైక్య ఆంధ్ర ఉద్యమం తమిళనాడు, కర్నాటక సరిహద్దులలోని గ్రామాలకు కూడా విస్తరించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో నివసించే ప్రజలలో అధిక సంఖ్యాకులు చాలా కాలం క్రితమే జిల్లాలో స్థిరపడిన తమిళులు, కన్నడిగులు. ప్రస్తుతం సాగుతున్న ఉద్యమంలో వారికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న నాయకులు, కార్యకర్తలు సమైక్యాంధ్రకు వారి మద్దతు తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దిశగా సరిహద్దు గ్రామాలలోని ఈ వర్గాలకు అర్థమయ్యేలా తమిళ, కన్నడ భాషలలో పోస్టర్లను, ప్లకార్డులను ముద్రించారు.
వాస్తవానికి సమైక్య ఆంధ్ర ఉద్యమం దిశగా ప్రజల దృష్టిని ఆకర్షించడానికై ఈ గ్రామాలలో 'తెలంగాణ తని మానిలం వేండం.. ఆంధ్ర మానిలం ఒరుమైయై పిరిక్కదింగె (మేము ప్రత్యేక తెలంగాణను కోరుకోవడం లేదు.దయచేసి ఆంధ్ర ప్రదేశ్ ను విభజించకండి)' అని తమిళంలో ముద్రించిన పోస్టర్లను ప్రదర్శించారు. తమిళనాడులో కన్యాకుమారికి, రామేశ్వరానికి వెళ్ళే రైళ్ళ బోగీలపై పోస్టర్లను, ప్లకార్డులను కార్యకర్తలు అంటించడమే కాకుండా వివిధ భాషలలో తమ ప్రచారోద్యమం పోస్టర్లను, ప్లకార్డులను ప్రైవేట్ జీపులు, లారీలు, ఇతర వాహనాలకు కట్టడంద్వారా జిల్లాలో నలుమూలలకూ విస్తరించేలా చూశారు.
రావూరి ఈశ్వరరావు యువ సేన కార్యకర్తలే అటువంటివి 20 వేల పోస్టర్లను సిద్ధం చేశారని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరితో కొందరు ప్రతినిధులు చెప్పారు. విభజన పరిష్కార మార్గం కాదని, ప్రజలంతా ఒక్కటేనని ప్రధానంగా ప్రచారం చేయాలని తాము నిశ్చయించినట్లు సేన కార్యకర్త ఎస్ సదాశివం తెలిపారు. 'తమిళనాడులోని వెల్లూరు, ఉత్తర ఆర్కాడ్, తిరువణ్ణామలై, కృష్ణగిరి జిల్లాలలో సమైక్యతపై పోస్టర్లను మేము పంపిణీ చేయగలం' అని సదాశివం చెప్పారు.
Pages: 1 -2- News Posted: 17 December, 2009
|