అద్వానీ వదలరు! న్యూఢిల్లీ : ఒక శకం ముగిసిందా? భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆంతరంగికులు అనేక మంది అలా భావించడం లేదు. అటల్ బిహారి వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ ఉన్నంత కాలం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎంతగా నొక్కి చెబుతున్నప్పటికీ పార్టీలో మూడవ ప్రధాన నేత ముందుకు వచ్చే అవకాశం లేదని వారు భావిస్తున్నారు. ఆ నేతలు ఇద్దరినీ ఖాతరు చేయనందుకు లేదా పక్కకు నెట్టడానికి ప్రయత్నించినందుకు డాక్టర్ మురళీ మనోహర్ జోషి, కె. జనా కృష్ణమూర్తి, రాజనాథ్ సింగ్ ఏ విధంగా మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందో వారు ప్రస్తావిస్తున్నారు.
లోక్ సభలో ప్రతిపక్ష నాయకునిగా తప్పుకోగలనని సంఘ్ కు తాను ఇచ్చిన హామీని అద్వానీ శుక్రవారం నెరవేర్చినప్పుడు పరివార్ లో ఆయన స్థాయి పెరిగి వేరే పదవితో పునరావాసం లభించింది.అయితే, ఆ పదవికి ఉండే అధికారాలేవో బిజెపిలో ఏ ఒక్కరికీ పూర్తి అవగాహన లేదు. కాని ఆయన గురించి తెలిసినవారు మాత్రం ఆయన దానిని కేవలం 'ఉత్తమ సేవా పురస్కారం'గా పరిగణించబోరని చెబుతున్నారు.
లోక్ సభలో బిజెపి సీట్ల సంఖ్యను అద్వాని 1989లోని 85 నుంచి 1991లో 120కి పెంచి, దేశ రాజకీయ వ్యవస్థలో పార్టీని రెండవ ప్రధాన పక్షంగా తీర్చిదిద్దినప్పుడు ఆయన దేశ రాజకీయాల సరళిని భిన్నంగా వ్యవహరించారు. ఆయన కులమేదో తెలియదు. తాను పక్కా హిందువును కానని ఆయన అంగీకరించారు.
అయినప్పటికీ, ఆయన 'రామ రథం' కుల, లింగ భేదాలకు అతీతంగా సాగిపోయింది. భారీ స్థాయిలో జన సమీకరణకు మతాన్ని విజయవంతంగా ఉపయోగించుకున్న తొలి రాజకీయ నాయకుడు బహుశా ఆయనే కావచ్చు.
Pages: 1 -2- News Posted: 19 December, 2009
|