'ఉద్యమం' ఉచిత మార్కులు? హైదరాబాద్ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో కలుగుతున్న అంతరాయాలకు పరిహారంగా ఎస్ఎస్ సి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పది నుంచి పదిహేను వరకు 'గ్రేస్ మార్కులు' మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. అయితే, ఈ పరీక్షలు ఏప్రిల్ లో ముగిసిన తరువాతే ప్రభుత్వం ఈ విషయమై తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. ప్రభుత్వం కనుక ఇప్పుడే ఈ నిర్ణయం ప్రకటించినట్లయితే, విద్యార్థులు పరీక్షల విషయమై అలసత్వం వహించవచ్చు.
ఇటీవలి తెలంగాణ ఉద్యమం, ప్రస్తుత సమైక్య ఆంధ్ర ఉద్యమం వల్ల విద్యా సంవత్సరానికి అంతరాయం కలిగిన దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో ఫలితాలు నాసిగా ఉండగలవని అన్ని జిల్లాల నుంచి విద్యా శాఖ అధికారులు నివేదికలు పంపుతుండడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన గురించి ఆలోచించసాగిందని తెలుస్తున్నది.
సాధారణంగా ప్రశ్న పత్రాలలో తప్పులు ఉన్న పక్షంలోనే విద్యార్థులకు ప్రభుత్వం గ్రేస్ మార్కులు మంజూరు చేస్తుంటుంది. క్రితం సంవత్సరం ఇంటర్మీడియ్ ప్రశ్న పత్రాలలో తప్పుల కారణంగా విద్యార్థులకు ఎనిమిది గ్రేస్ మార్కులు కలిపారు. ఎంసెట్-2008లో పది గ్రేస్ మార్కులను, ఎంసెట్-2009 ప్రశ్న పత్రాలలో అవకతవకలకు మూడు గ్రేస్ మార్కులను ప్రభుత్వం మంజూరు చేసింది.
Pages: 1 -2- News Posted: 21 December, 2009
|