'దీక్ష' కు నిమ్స్ రక్ష హైదరాబాద్ : తమకు ప్రీతిపాత్రమైన అంశాలపై ధైర్యంగా 'ఆమరణ నిరాహార దీక్షలు' చేస్తామని ప్రకటించే రాజకీయ నాయకులు తమ విలువైన ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రతిష్ఠాకరమైన నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేరడాన్ని క్రమంగా అలవాటు చేసుకుంటున్నారు. 'ఆమరణ నిరాహార దీక్ష' సాగిస్తూనే అత్యున్నత స్థాయి వైద్య సదుపాయాలు పొందాలని తహతహలాడడం సమంజసం కాదని వారికి తోచకపోవడం విచిత్రం. నిరాహార దీక్షకు గాను అరెస్టయి ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో తమను చేర్పించగానే నిమ్స్ లో చేరేట్లు చూసేందుకు వారు ఆకాశాన్నే కిందకు దించేంత హంగామా చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు (కెసిఆర్) నుంచి కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్, ఎంఎల్ సి వై.ఎస్. వివేకానందరెడ్డి వరకు ప్రతి ఒక్క నాయకుని విషయంలో ఇదే విధంగా జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోజు గడపగానే వారందరికీ భయం పట్టుకుంది. తమకు అత్యున్నత శ్రేణి వైద్య చికిత్స కావాలని వారు కోరారు. దీనితో తమ వద్ద తగినన్ని సౌకర్యాలు లేవని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు కూడా చెప్పేందుకు వీలు కలిగింది. పడకల కొరతను సాకుగా చూపుతూ నిమ్స్ సాధారణ రోగులను తిప్పి పంపివేసింది కాని, 'నిరాహార దీక్ష'లో ఉన్న లగడపాటి రాజగోపాల్ ను నిమ్స్ వైద్యులు అడ్డుకోలేకపోయారు. ఆయన పరుగెత్తుకుంటూ వచ్చి నిమ్స్ లో ఖాళీగా ఉన్న ఒక బెడ్ ను ఆక్రమించారు.
నిమ్స్ కు తమను తరలించేట్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్ హెచ్ఆర్ సి)ని ఆశ్రయించడం నిరాహార దీక్షలో ఉన్న రాజకీయ నాయకులకు సులభ మార్గంగా కనిపిస్తున్నది. దీని వల్ల వారికి శ్రేష్టమైన వైద్య చికిత్సతో పాటు మీడియాలో చక్కగా ప్రచారం కూడా లభిస్తున్నది. 'ఇది కేవలం రాజకీయం. ప్రచారం కోసం ఎత్తుగడ' అని తెలుగు దేశం శాసనసభా పక్షం ఉప నాయకుడు, వైద్యుడు నాగం జనార్దనరెడ్డి వ్యాఖ్యానించారు. 'ఇది చాలా చిరాకు కలిగిస్తున్నది' అని ఆయన చెప్పారు.
నిమ్స్ లో చేరాలనే మోజుకు కె. చంద్రశేఖరరావు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ సమీపంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించేందుకు ముందు ఆయనను అరెస్టు చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. రెండు గంటల తరువాత ఆయన ఆరోగ్యం 'క్షీణించింది'. ఫలితంగా ఆయనను ఖమ్మంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. కెసిఆర్ ను నిమ్స్ కు తరలించాలనే అభ్యర్థనలు లెక్కకు మించి వచ్చాయి. ఎస్ హెచ్ఆర్ సి వద్ద దాఖలు చేసిన పిటిషన్ తో అనుకున్న పని నెరవేరింది.
Pages: 1 -2- News Posted: 23 December, 2009
|