అందరిపై నిఘా నేత్రం న్యూఢిల్లీ : నిఘా నేత్రం మనల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. వెయ్యి కళ్లు మన ప్రతీ కదలికనూ పసిగడుతూనే ఉంటాయి. మనమేం చేసినా నిఘా వెంటాడుతూనే ఉంటుంది. మరో సంవత్సంరంలో భారత పౌరులందరూ నిఘా నేత్రం నీడలోనే సంచరించవలసి ఉంటుంది. ఎక్కడో ఎటిఎం మెషీన్ లో క్రెడిట్ కార్డు పెడితే చాలు... ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ తెరిస్తే చాలు, అంతెందుకు మనం ఫోన్ ఎత్తితే చాలు... టిక్కెట్ కొనుక్కుని విమానం ఎక్కినా అంతే... ఎవరో ఎవరో గమనిస్తూనే ఉంటారు. ప్రతీ కదలికనూ రికార్డు చేస్తూనే ఉంటారు. దేశంలోని పౌరులకు సంబంధించిన అన్ని వివరాల డాటా బేస్ ను నిఘా విభాగంతో అనుసంధానం చేయడానికి భారత ప్రభుత్వం నిశ్చియించింది. ప్రైవేట్, ప్రభుత్వ కంపెనీల వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని నిఘా గొడుగులోకి తేవడానికి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కేంద్ర హోం మంత్రి చిదంబరం లక్ష్యం మేరకు 2011 మే నాటికి నేషనల్ ఇంటిలిజెన్స్ గ్రిడ్(నాట్ గ్రిడ్ ) ఏర్పడినట్లయితే పౌరులకు సంబంధించిన 21 వ్యవహారాలు భద్రతా సంస్థల నిఘాలోకి వెళ్ళిపోతాయి. బ్యాంకు ఎక్కౌంట్ వివరాలు, క్రెడిట్ కార్డు లావాదేవీలు, డ్రైవింగ్ లైసెన్సు, వీసా, పాస్ పోర్టు, విదేశీ పర్యటనలు లాంటి దైనందిన చర్యలన్నింటిపై నిఘా పడుతుంది. ప్రభుత్వ శాఖలు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విదేశీ పర్యటనల విభాగం, సెల్ ఫోను కంపెనీలు, ఎయిర్ లైన్ కంపెనీలు- ఇలాంటి ప్రైవేట్ కంపెనీల నుంచి దాదాపు 50 రకాల వివరాలు నాట్ గ్రిడ్ లోకి వెళతాయ. ఏదైనా నిఘా విభాగం లేదా భద్రతా విభాగం మన పేరును తమ కంప్యూటర్ లో టైప్ చేయగానే మొత్తం జాతకం అంతా కనిపిస్తుందన్న మాట!
'ఒకసారి వ్యక్తి పేరు కంప్యూటర్ లో రాయగానే డాటా బేస్ లో నమోదు అయిన అన్ని వివరాలు వచ్చేస్తాయి. అఖరికి ఆ వ్యక్తి ఉపయోగిస్తున్న కారు రంగుతో సహా. ట్రాఫిక్ కానిస్టేబుల్ కు కట్టిన జరిమానాలు కూడా.. చివరకూ రాత్రి మీ స్నేహితులతో కలిసి బారులో కార్డుతో చెల్లించిన బిల్లు వివరాలతో సహ 'అంటూ ఓ అధికారి వివరించారు. వాస్తవానికి ప్రభుత్వం నుంచి ఏ పౌరునికీ దాచవలసిన రహస్యాలు ఏమీ ఉండవు అని ఆయన వ్యాఖ్యానించారు. అచ్చు అమెరికా మాదిరిగా అన్నమాట.
Pages: 1 -2- News Posted: 23 December, 2009
|