తివారీ రాసలీలలు? హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ పౌరుడు గవర్నర్ నారాయణ్ దత్ తివారి రాజ్ భవన్ లో రాసలీలలను సాగిస్తున్నట్లు ఒక తెలుగు న్యూస్ టివీ చానల్ ప్రసారం చేసి సంచలనం సృష్టించింది. పదేపదే ప్రసారం చేస్తున్న తివారి శృంగార దృశ్యాలను నిలిపి వేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో వాటి ప్రసారం నిలిపి వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గవర్నరు తివారిపై ప్రైమాఫైసీ ఉందని, కేసు పెట్టవచ్చని న్యాయనిపుణుడు మాడభూషి శ్రీధర్ అభిప్రాయపడ్డారు. అలానే ఈ దృశ్యాలను వెంటనే రాష్ట్రపతికి, ప్రధానికి పంపించాలని ఆయన సూచించారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా తివారి పై ఆగ్రహం పెల్లుబుకుతోంది. అత్యున్నత పదవిలో ఉండి పవిత్రమైన రాజ్ భవన్ ను కామకేళీ విలాస మందిరంగా మార్చివేసిన తివారిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అన్ని పార్టీల నాయకులు, మహిళా సంఘాలు, విద్యార్ది సంఘాలు డిమాండ్ చేశాయి. గవర్నరు తివారి వ్యవహారం శుక్రవారం నాడు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. టివి ప్రసారం చేస్తున్న నమ్మశక్యం కాని దృశ్యాలను చూసి ప్రజానీకం నిశ్చేష్టులయ్యారు. వేర్పాటు వాద ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడికి పోతుంటే సాక్షాత్తు గవర్నరు అందునా 82 సంవత్సరాల వయోవృద్ధుడు తివారి సాగిస్తున్నట్లు ధృవీకరిస్తున్న వికారపు చేష్టల దృశ్యాలను చూసి అగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.
రాష్ట్ర గవర్నరు తివారి ప్రతీ రోజూ రాజ్ భవన్ కు యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలను రప్పించుకుని, మసాజ్ నెపంతో వారితో కామవాంఛలు తీర్చుకుంటున్నారని పేర్కొంటూ తెలుగు టీవీ వార్తా ఛానల్ ఎబిఎన్- ఆంధ్రజ్యోతి శుక్రవారం ఉదయం దృశ్యరూపక కథనాన్ని ప్రసారం చేయడం ద్వారా బండారాన్ని బద్దలుచేసింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తివారి పనిచేసినప్పుడు ఆయనతో సాన్నిహిత్యం పెంచుకున్న ఒక మహిళ సాయంతో ఇప్పుడు అమ్మాయిలను రాజ్ భవన్ కు రప్పించుకున్నట్లు పేర్కొంది. దీనికి గవర్నర్ దగ్గర పనిచేసే అధికారి అరవింద్ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించింది.
Pages: 1 -2- News Posted: 25 December, 2009
|