విద్యార్ధికి ఎంత నష్టం!? హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి యూనియన్ నాయకులు, రాజకీయ పార్టీలు ఉద్యమం సాగిస్తూంటే నగరంలోని విశ్వవిద్యాలయాలు నెలకు పైగా తమ సంస్థలను మూసివేసుకోవలసి వచ్చింది. మరొకవైపు ఈ విశ్వవిద్యాలయాలలోను, వీటి అనుబంధ కళాశాలలలోను చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతున్నది. ఇదే పరిస్థితి మరి 15 రోజుల పాటు కొనసాగినట్లయితే, విద్యా సంవత్సరాన్ని కాపాడడానికి ఏమి చేసినా ప్రయోజనం ఉండదని జెఎన్ టియు, ఒయు అధికారులు అంగీకరించారు. పరీక్షలను త్వరలో నిర్వహించని పక్షంలో విద్యార్థులు మొత్తం సంవత్సరాన్ని నష్టపోవలసి ఉంటుందని, ఎందుకంటే వారు బాగా వెనుకబడిపోతారని నగరంలోని ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.
విదేశాలకు వెళ్ళాలని, లేదా పోటీ పరీక్షలకు హాజరు కావాలని యోచిస్తున్న విద్యార్థులు కూడా కలవరపడుతున్నారు. 'గేట్ కు దరఖాస్తు చేసేందుకు మూడవ సంవత్సరం విద్యార్థులను వారు ఈ సంవత్సరం నుంచి అనుమతిస్తున్నారు. చివరి సంవత్సరం సిలబస్ నుంచి ప్రశ్నలు కూడా ఆ పరీక్షలో వస్తాయి. మేము మా రెండవ సెమిస్టర్ క్లాసులనే ఇంకా మొదలుపెట్టలేదు. ప్రస్తుతం చర్చిస్తున్న రాజకీయ సమస్య ముఖ్యమైనదే. అయితే ఇది మా కెరీర్ లను నష్టపరచకూడదు కదా' అని ఒయు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విద్యార్థిని వై. కిరణ్మయి అన్నది.
Pages: 1 -2- News Posted: 29 December, 2009
|