'నరసింహన్' కలవరం
హైదరాబాద్ : నరసింహన్... మాజీ ఐపిఎస్ అధికారిని ఈ రాష్ట్రానికి గవర్నరుగా ఎందుకు పంపినట్లు? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదులను, వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న మావోయిస్టులను వేధిస్తోంది. రాష్ట్రపతిపాలన అనుమానాలు మనసులను దొలిచేస్తున్న తరుణంలో రాజకీయేతర వ్యక్తిని, అందునా రాష్ట్రంలో ఇంటిలిజెన్సు బాస్ గా గతంలో పనిచేసిన మనిషిని, అంతేకాక ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులను విజయవంతంగా అణచివేసిన అనుభవం ఉన్న మాజీ పోలీసును ఇక్కడ గవర్నర్ గా నియమించడం కొంచెం కలవరాన్ని కలిగిస్తోంది. దానికి తగ్గట్టుగానే గవర్నరు నరసింహన్ బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్ర శాంతి భద్రతలపై సమీక్ష జరపడం, దానికి ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా రాజ్ భవన్ కు రావడం కూడా సంచలన సంకేతాలను ఇస్తోంది. రబ్బరు స్టాంపు గవర్నర్ కాదని, కేంద్రం చాలా అధికారాలు కట్టబెట్టి, బోల్డన్ని లక్ష్యాలను భుజాన పెట్టి నరసింహన్ ను ఇక్కడ ప్రతిష్టించిందన్న వాస్తవం తెలంగాణ, సమైక్యాంధ్ర వాదులకు అర్ధం అవుతోంది.
దానికి తోడు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు (కిషన్ జీ) గవర్నరు నరసింహన్ ను వర్ణించిన తీరు భయాన్ని రేకెత్తించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వచ్చిన నరసింహన్‌ను నరహంతకుడిగా కిషన్ జీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సలైట్లను అంతం చేయడానికి కేంద్రం అమలు చేస్తున్న 'ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు నరసింహన్ రూపకల్పన చేశారన్న నిజాన్ని కిషన్ జీ వెల్లడించార. నరసింహన్‌ను వెనక్కు వెళ్లిపోవాలని ఆయన హెచ్చరిం చారు. ఛత్తీస్‌గఢ్‌లో 144 మంది మహిళలు రేప్‌కు గురికావడానికి నరసింహనే కారణమని కిషన్ జీ ఆరోపించారు. మావోయిస్టుల ఆరోపణలను గమనిస్తే శాంతి భద్రతల రక్షణలో నరసింహన్ ఆరితేరిన పోలీసని చెప్పకనే తెలుస్తోంది. రాష్ట్రంలో అశాంతి నెలకొన్న నేపథ్యంలో ఆయన శాంతి భద్రతలు అదుపులోకి తేవడంపై దృష్టి సారించారు.
Pages: 1 -2- News Posted: 30 December, 2009
|