తెలంగాణలో మావో పాగా? హైదరాబాద్ : అదను కోసం ఎదురుచూస్తున్న మావోయిస్టులకు ఆంధ్రదేశంలో అద్భుతమైన అవకాశం అందివచ్చింది. పోలీసులు తరిమి కొట్టడంతో కకావికలమై రాష్ట్రాన్ని వదిలిపోయిన మావోయిస్టులు మళ్ళీ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోడానికి సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ అంశంపై సాగుతున్న రాజకీయ సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని మావోయిస్టులు చాలా బలంగా తెలుగునేలపై జెండా పాతుతున్నారని పోలీసు నిఘా వర్గాలు నిర్ధారిస్తున్నాయి.
తాము బలపడటానికి రాజకీయ సంక్షోభాలను ఉపయోగించుకోవడం మావోయిస్టు వ్యూహకర్తలకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయపార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఉద్యమాల్లోకి దూసుకువచ్చినప్పుడు మావోయిస్టులు బలపడుతూ ఉంటారు. తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం సరిగ్గా మావోయిస్టులు కోరుకునే అనుకూలమైన రాజకీయ పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పాగా వేయడానకి మావో నేతలు పావులు కదుపుతున్నారని నిఘా వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.
తెలంగాణాకు అనుకూలంగా మావోయిస్టులు తమ గళాన్ని స్పష్టంగానే వినిపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లాల్ గఢ్ లో రక్తపాతం సృష్టించిన మావోదళాలకు సూత్రధారిగా ఉన్నఆ పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అవకాశం దొరికినప్పుడల్లా తెలుగు టివీ చానళ్ళకు ఫోన్ ద్వారా ప్రకటనలు విడుదల చేస్తూనే ఉన్నారు. కాకతాళీయమే కావచ్చు గాని చంద్రబాబు కబంధహస్తాల నుంచి బయటపడి తెలంగాణ తెలుగుదేశం నాయకులు జెఎసిలో చేరాలని పిలుపు ఇస్తూ మావోయిస్టు ఉత్తర తెలంగాణ విభాగం కార్యదర్శి ప్రకటన విడుదల చేసిన తరువాతే నాగం, రేవంత్ రెడ్డి బృందం జెఎసిలో చేరింది.
Pages: 1 -2- News Posted: 31 December, 2009
|