పురంధేశ్వరిదే లక్కు హైదరాబాద్ : 2009 సంవత్సరం తొమ్మది సంవత్సరాల వలయాన్ని పూర్తి చేసింది. కొత్త సంవత్సరం 2010 మరొక తొమ్మిది సంవత్సరాల వలయానికి నాంది పలుకుతున్నది. ఇది 2018తో పూర్తవుతుంది. ఈ సంవత్సంర కొత్త సహస్రాబ్దిలో తొలి దశాబ్దిని కూడా పూర్తి చేస్తుంది. ఇది కొత్త దశాబ్దికి నాంది పలకబోతున్నది. సంఖ్యా శాస్త్రంలోల పది అంకె సూర్య గ్రహాన్ని సూచిస్తుంది. సూర్యుడు సమస్త ప్రపంచానికి పాలకుడు. తక్కిన ఎనిమిది గ్రహాలకు అధిపతి.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఈ ఏడాది అదృష్టశాలి కాగలరు. ఎందుకంటే ఆమె జన్మ తేది 4, నెల నాలుగు (ఏప్రిల్). ఆమె పేరు (ఆంగ్లాక్షరాలు అన్నీ కలిపితే) 1ని సూచిస్తుంది. పది అంకె శక్తితో ఆమె రాజకీయాలలో ఏదో ఒక ఉన్నత హోదాను అందుకోగలరంటే ఎవరికైనా ఆశ్చర్యం అనిపించవచ్చు. 2010 సంవత్సరంలో పురంధేశ్వరికి రాజకీయంగా ఒక ప్రత్యేక ఆఫర్ రావచ్చు.
ఇక టాలీవుడ్ కు సంబంధించినంత వరకు తన శక్తిమంతైన అదృష్ట సంఖ్య (మాస్టర్ సంఖ్యగా కూడా పేరొందిన) 11తో మహేష్ బాబు 2010లో మంచి పునాది వేసుకోగలరు. ఆయన 2012 వరకు ఉత్థానం పొందగలరు. జూనియర్ ఎన్టీఆర్ అదృష్ట సంఖ్య 1 అయినందున ఆయన 2010లో ఎంతో లాభం పొందగలరు. మరింత మెరుగైన ఫలితాలు రాబట్టుకోవడానికి ఆయనతన పేరు ముందు 'మైటీ స్టార్' అనే బిరుదు తగిలించుకోవాలి.
Pages: 1 -2- News Posted: 1 January, 2010
|