డాక్టర్లకు గిఫ్ట్ లు బంద్ హైదరాబాద్: ఔషధ సంస్థల నుంచి గాని, హెల్త్ కేర్ పరిశ్రమనుంచి గాని కానుకలను స్వీకరించకుండా లేదా ప్రయాణ సౌకర్యాలను అంగీకరించకుండా వైద్యులపై భారత వైద్య మండలి (ఎంసిఐ) నిషేధం విధించింది. మందుల సంస్థల కానుకలు, ప్రయాణ సౌకర్యాలపై డాక్టర్లకు ఒక నియమావళిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్న ఎంసిఐ మందుల సామర్థ్యంపై ప్రకటనలలో గాని, ప్రైవేట్ అధ్యయనాలలో గాని పాల్గొనవద్దని డాక్టర్లను కోరుతూ 2002 నాటి భారతీయ వైద్య మండలి (వృత్తిపరమైన ప్రవర్తన, నైతిక ప్రమాణాలు) నిబంధనావళిని సవరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఔషధ సంస్థల నుంచి ఎటువంటి ఆతిథ్యాన్నీ స్వీకరించవద్దని కూడా వైద్యులను ఎంసిఐ కోరింది.
హైదరాబాద్ నగరంలోని డాక్టర్లు ఈ కొత్త మార్గదర్శక సూత్రాల పట్ల హర్షం వెలిబుచ్చారు. బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ పి. రఘురామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, హెల్త్ కేర్ రంగంలో ప్రతి విభాగంలో 'కట్ ప్రాక్టీస్' సర్వసాధారణమని, 'రోగులకు హానికరమైన ఈ అనారోగ్యకరమైన అలవాటును' అరికట్టవలసిన తరుణం ఆసన్నమైందని అన్నారు. 'మందులు, డయగ్నోస్టిక్ పరీక్షలు (వాటిలో కొన్ని అనవసరం కావచ్చు) సూచించినందుకు డబ్బు తీసుకోవడం, రోగులను ప్రలోభపెట్టే లక్ష్యంతో వ్యక్తులను నియోగించడం వంటి అనైతిక పద్ధతుల ఫలితంగా అత్యుత్తమ డాక్టర్ చుట్టూ 'తిరిగి అమ్మకాలు జరుపుకోవడం' పరిపాటి అయింది' అని ఆయన పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 2 January, 2010
|