రెండుసార్లు పుట్టిన మమత!
కోలకతా : మమతా బెనర్జీ రెండుసార్లు జన్మించారు. అదీ తొమ్మిది నెలల తేడాతో. ఒక జన్మ తేదీ 05.01.1955 (ఇది అధికారికం, కాని తప్పు). మరొక జన్మ తేది 05.10.1955 (ఇది అనధికారికం, కాని అసలైనది). బుద్ధదేవ్ భట్టాచార్జీ గారు తస్మాత్ జాగ్రత్త! మమత బెనర్జీ విచిత్ర మనిషి.
తన 55వ ఏట రైటర్స్ బిల్డింగ్స్ (బెంగాల్ సచివాలయం) దిశగా అప్రతిహతంగా సాగిపోతున్న మమతలో విచిత్రంగా ఈ రెండు జన్మ తేదీల కేసు మరొక కోణాన్ని సూచిస్తున్నది. లోక్ సభ వెబ్ సైట్ ప్రకారం రైల్వే మంత్రి మమతా బెనర్జీ జన్మ తేదీ జనవరి 5. అయితే, ఆమె అనుచరులు పుష్పగుచ్ఛాలు, శుభాకాంక్షల సందేశాలతో మంగళవారం ఉదయం హరీష్ చటర్జీ రోడ్డులోని 30బి భవనంలోకి అడుగుపెట్టసాగినప్పుడు వారికి వ్యతిరేకత ఎదురైంది. 'అప్నారా ఎఖానీ కీ కోర్చేఁ? ఆజ్ కోనో జన్మదిన్ తన్మోదిన్ నై. కోనో జినిష్ నెవా జబే న (మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? ఇవాళ ఎవరిదీ జన్మదినం కాదు. మేము ఎటువంటి కానుకలూ అంగీకరించం)' అని మమత సహాయకుడు ఒకరు అయోమయంలో చిక్కుకున్న ఆ జనాన్ని కసిరారు.
ఈ గందరగోళం చాలదన్నట్లుగా తృణమూల్ కాంగ్రెస్ (టిసి) సభ్యులు కొందరు 'ఇవాళ దీదీ జన్మదినం' అని మరొక బృందంతో చెప్పి పుష్పగుచ్ఛాలు అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసి, ఇక ఆఫీసులో నుంచి వెళ్లిపోవలసిందిగా కోరారు. 'అసలు ఏం జరుగుతోంది? ఇవాళ ఆమె పుట్టిన రోజా? కాదా?' అని తెల్లవారు జామున 5.30 గంటల నుంచి మమత కోసం నిరీక్షిస్తున్న బెల్ఘారియా మహిళ ఆగ్రహంతో ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానం ఆమెకు చాలా గంటల తరువాత (బహుశా) పుట్టిన రోజు మహిళ నుంచే వచ్చింది. మంగళవారం సాయంత్రం విలేఖరుల గోష్ఠిలో తన జన్మతేదీ గురించిన ప్రశ్నలకు చిరాకు పడిన మమత ఆతరువాత 'ఇవాళ నా పుట్టిన రోజు కాదు. అయినా నేను నా పుట్టిన రోజును ప్రత్యేకంగా జరుపుకోను' అని చెప్పారు. ఆమెకు బద్ధశత్రువైన మార్క్సిస్ట్ నేత బుద్ధదేవ్ ది కూడా అదే విధానం.
Pages: 1 -2- News Posted: 6 January, 2010
|