ఇది అనర్థాల గ్రహణం
హైదరాబాద్ : సంక్రాంతి పండుగల సమయంలో జనవరి 15న సంభవించనున్న సూర్య గ్రహణం కొన్ని రాశుల వారికి అనర్థదాయకం కాగలదని జ్యోతిష్కులు సూచిస్తున్నరు. అయితే, సైంటిస్టులు మాత్రం సూర్య గ్రహణం సహజ పరిణామమని, దీనికి అపశకునాలు ఆపాదించడం 'అశాస్త్రీయం' అని వాదిస్తున్నారు. ఇక ఈ 'పరమాద్భుత ఘట్టాన్ని' మామూలు మాటలలో వర్ణించజాలమని తారా పరిశీలకులు అంటున్నారు.
'కంకణ గ్రహణం'గా కూడా పేర్కొనే ఈ సూర్య గ్రహణం సూర్యుడు, చంద్రుడు కచ్చితంగా ఒకే రేఖపైకి వచ్చినప్పుడు సంభవిస్తుంది. అంటే, సూర్యుడికి చంద్రుడు అడ్డుగా నిలిచినప్పుడు సూర్యుడు చంద్రుని పరివేష్టించి ఉన్న కాంతిమంతమైన ఒక కంకణంగా కనిపిస్తాడు.
షష్టాష్టక చతుష్టయంతో పాటు ఈ నెలలో సంభవిస్తున్న రెండు గ్రహణాలు తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తాయని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠం ఆస్థాన పండితుడు పి. శ్రీనివాస గార్గేయ సూచిస్తున్నారు. ఇక జ్యోతిర్వైద్య రత్న ప్రొఫెసర్ సి.వి.బి. సుబ్రహ్మణ్యం చెపుతున్న ప్రకారం, మకర, కుంభ, తుల, మిథున రాశులలో జన్మించినవారు ఈ గ్రహణం దుష్ప్రభావాలకు లోను కావచ్చు. వారు బంగారంతో తయారు చేసిన సూర్య దేవుని చిహ్నాన్ని, వెండితో చేసిన చంద్రుని చిహ్నాన్ని దానం చేయాలని ఆయన సూచిస్తున్నారు. (వాటి పరిమాణం, బరువు, విలువ ఎంతైనా ఫర్వాలేదు). వస్త్రాలు, ఆవు నెయ్యి కూడా దానం చేయవచ్చు.
Pages: 1 -2- News Posted: 6 January, 2010
|