ప్రజాతీర్పుతోనే విభజన న్యూఢిల్లీ : రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని తన పాత్రతో పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యపై తిరిగి చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడడానికి సముచిత చర్యలనే తీసుకున్నది. అత్యధిక సంఖ్యాకులు మౌనంగా వెలువరించిన తీర్పుకంటే ఒక మనిషి నిరాహార దీక్ష లేదా కొన్ని వందల మంది ఆగ్రహావేశాలు గొప్పవన్న తీరులో భారతీయ ప్రజాస్వామ్యం మారిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సృష్టికి సిసలైన కారణాలే ఉన్నప్పటికీ హింసాకాండ, అల్లకల్లోలం, రాజకీయ బ్లాక్ మెయిలింగ్ కొత్త రాష్ట్రం ఏర్పాటుకు దోహదం చేయజాలవు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రెండు విధాలుగా అభిప్రాయ వ్యక్తీకరణ చేయవచ్చు. ఎన్నికలలో తీర్పు ద్వారా గాని, ఎటువంటి అరమరికలూ లేని, సమగ్రమైన సంప్రదింపుల ద్వారా గాని ఈ పని చేయవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి సూత్రధారుడైన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణించడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిపై ఆ ఎన్నికల తీర్పు ఆంతర్యమేమిటో పార్టీయే స్వయంగా రకరకాలుగా భాష్యం చెబుతున్నది. ఈ అయోమయ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం రంగ ప్రవేశం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయ వ్యక్తీకరణకు మరొక యంత్రాంగాన్ని ప్రతిపాదించింది. తెలుగు సమాజంలోని అన్ని వర్గాల వారితో, రాష్ట్ర ప్రజలతో కేంద్ర హోమ్ శాఖ మంత్రి ప్రారంభించిన చర్చలు, సంప్రదింపులను అందరూ స్వాగతించాలి.
వెనుకకు వెళ్లిన తెలంగాణ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు (కెసిఆర్) తిరిగి ప్రాధాన్యతాంశంగా మార్చగలిగినందున ఈ సమస్య పరిష్కారానికి హేతుబద్ధమైన, సమంజసమైన ప్రక్రియను అనుసరించవలసి ఉంటుందనే అభిప్రాయాన్నిఆయన మన్నించాలి. ఇటీవలి ఉద్యమం వల్ల తలెత్తిన శాంతి భద్రతల సమస్యలు, రాజకీయ అనిశ్చితి కారణంగా హైదరాబాద్ నష్టపోతుంటే చూడాలని ఏ ఒక్కరూ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కోరుకోరు. మరీ ముఖ్యంగా తెలంగాణలోని ఏ శ్రేయోభిలాషీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మావోయిస్ట్, నక్సలైట్ శక్తులు హైజాక్ చేయడాన్ని ఇష్టపడరు. ఎన్నికలలో పోటీ ద్వారా ప్రజలలో తమకు ఎంత ఆదరణ ఉందో పరీక్షించుకునే ధైర్యం లేని ఆ శక్తులు కీలకస్థానంలోకి రావడానికి ఇలాంటి మార్గాలనే ఎంచుకుంటాయి.
Pages: 1 -2- News Posted: 7 January, 2010
|